Reserved judgement : ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. తీర్పు రిజర్వు చేసిన సీజే ధర్మాసనం
![Reserved judgement](https://jaisw-media-te-bucket.s3.ap-south-1.amazonaws.com/uploads/2024/11/12185140/P-19-3-1.jpg)
Reserved judgement
Reserved judgement : తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై మంగళవారం హైకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వు చేసింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై సింగిల్ బెంచ్ తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ కు వెళ్లారు. అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ పై హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరువైపుల వాదనలు విన్న సీజే ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.
బీఆర్ఎస్ తరపున సీనియర్ న్యాయవాది మోహన్ రావు వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదన్నారు. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్ కు విచారణ అర్హత లేదన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇరువైపులా వాదనలు విని, విచారణ ముగిస్తున్నట్లు ప్రకటించిన సీజే ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.