Asaduddin : ఎంఐఎంను ఓడించడం ఎవరి వల్ల కాదు: అసదుద్దీన్

Asaduddin

Asaduddin

Asaduddin : హైదరాబాద్ కు కేంద్రం నుంచి మోదీ వచ్చినా, అమిత్ షా వచ్చినా ఎవరూ ఎంఐఎం పార్టీని ఓడించలేరని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం కొడంగల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఎంఐఎం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేంద్ర మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత 15 సంవత్సరాలుగా ముస్లింలపై దేశవ్యాప్తంగా ఎన్నో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగ ఉందని అన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్ి హిందు, ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. యూపీలో నిర్వహిస్తున్న కన్వర్ యాత్రలో షాపులకు యజమాని పేరు ప్రదర్శించాలని యోగి ప్రభుత్వం, ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం మతాల మధ్య చిచ్చుపెట్టడమే అని వ్యాఖ్యానించారు.

TAGS