JAISW News Telugu

MP Sanjay Raut : పరువు నష్టం కేసు.. ఎంపీ సంజయ్ రౌత్ కు 15 రోజులు జైలు

MP Sanjay Raut

MP Sanjay Raut

MP Sanjay Raut : శివసేన (ఉద్ధవ్ వర్గం) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కు న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో సంజయ్ రౌత్ కు ముంబై కోర్టు 15 రోజులు జైలుశిక్ష విధించింది. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఆయనకు 15 రోజులు జైలుశిక్ష విధిస్తూ ముంబై కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 500 కింద రౌత్ ను దోషిగా నిర్ధారిస్తూ ఆయనకు రూ.25 వేలు జరిమానా కూడా విధిస్తున్నట్లు వెల్లడించింది.

మహారాష్ట్ర బీజేపీ నేత కిరీట్ సోమయ్య కుటుంబ సభ్యులు ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు. మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ లో రూ.100 కోట్ల టాయిలెట్ స్కాం జరిగిందని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఇక, ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. అయితే, వీటిని ఖండించిన కిరీట్ సోమయ్య సతీమణి మేధ ఎటువంటి ఆధారాలు లేకుండా తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోర్టును ఆశ్రయించారు.

Exit mobile version