Minister Lokesh : ‘సాక్షి’పై పరువు నష్టం కేసు.. విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి లోకేశ్

Minister Lokesh
Minister Lokesh : పరువు నష్టం దావా కేసులో మంత్రి నారా లోకేశ్ విశాఖ కోర్టుకు హాజరయ్యారు. గతంలో ఆయన సాక్షి మీడియాపై రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్య కథనాలు ప్రచురించారని అందులో పేర్కొన్నారు. తప్పుడు కథనం రాసిన ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలని లోకేశ్ కొంత కాలంగా పోరాటం చేస్తున్నారు. ఆయన తరపు న్యాయవాదులు శుక్రవారం కోర్టులో వాదనలు వినిపించనున్నారు.