Nagarjuna : మంత్రి సురేఖపై పరువు నష్టం కేసు.. రేపు నాగార్జున వాంగ్మూలం నమోదు

Nagarjuna and Konda Surekha
Nagarjuna : మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు నాగార్జున వేసిన క్రిమినల్ పరువునష్టం దావాపై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. నాగార్జున తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ అంశంలో మంగళవారం నాగార్జున వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని కోర్టు పేర్కొంది. నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
సమంత-నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలు తమ కుటుంబ పరువుకు భంగం కలిగించాయని ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే గత గురువారం మంత్రి సురేఖపై పరువునష్టం దావా వేశారు.