Deepti Sunaina : సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్, ఫాలోయింగ్ ని దక్కించుకొని సెలబ్రిటీ రేంజ్ కి ఎదిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిలో దీప్తి సునైనా ఒకరు. యూట్యూబ్ లో కవర్ సాంగ్స్ మరియు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి క్రేజ్ ని దక్కించుకున్న ఈ అమ్మాయికి బిగ్ బాస్ రియాలిటీ షో లోకి అడుగుపెట్టే ఛాన్స్ దక్కింది. సీజన్ 2 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈమె అతి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
ఈమెకి షణ్ముఖ్ జస్వంత్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. వీళ్లిద్దరు కలిసి ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. అలా వీళ్ళ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి కూడా చేసుకుందాం అని అనుకున్నారు. కానీ షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మొత్తం చెయ్యి దాటిపోయాయి.
బిగ్ బాస్ హౌస్ లోపల దీప్తి షణ్ముఖ్ జస్వంత్ మరియు సిరి మధ్య జరిగిన రొమాన్స్ అప్పట్లో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఇద్దరికీ కూడా పెళ్లిళ్లు ఫిక్స్ అయ్యాయి, అయినప్పటికీ కూడా వీళ్ళు హౌస్ లో ఉన్నంత కాలం హద్దులు మొత్తం చెరిపేసారు. ఇవన్నీ చూసిన తర్వాత షణ్ముఖ్ పై విరక్తి కలిగి దీప్తి సునైనా బయటకి వచ్చిన వెంటనే బ్రేకప్ చెప్పేసింది. బయటకి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న వీళ్లిద్దరు కేవలం ఈ రియాలిటీ షో వల్ల విడిపోవడం వీళ్ళని అభిమానించే అభిమానులకు చాలా బాధని కలిగించింది. అయితే ఇద్దరు ఒకరిని ఒకరు మర్చిపోయి ఎవరి జీవితం లో వాళ్ళు బిజీ గా ఉన్నారు. షణ్ముఖ్ జస్వంత్ రీసెంట్ గానే ‘స్టూడెంట్’ అనే వెబ్ సిరీస్ చేసాడు, దీనికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీప్తి సునైనా కూడా కూడా పలు కవర్ సాంగ్స్ చేస్తూ బిజీ గా ఉంది.
అయితే దీప్తి సునైనా తో విడిపోయిన తర్వాత షణ్ముఖ్ మళ్ళీ వేరే అమ్మాయితో ప్యాచప్ అవ్వలేదు. కానీ దీప్తి సునైనా మాత్రం రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఒక అబ్బాయితో ఫోటోలు దిగుతూ అవి అప్లోడ్ చేసింది. దీనిని చూసిన ప్రతీ ఒక్కరు, కొత్త ప్రేమికుడు దొరికాడా అంటూ కామెంట్స్ చేసారు. కానీ అతను ఎవరు ఏమిటి అనేది మాత్రం ఇంకా చెప్పలేదు. ఏదైనా కవర్ సాంగ్ కి సంబంధించిన ఫోటో అయ్యుంటుంది అని అనుకుంటున్నారు కొంతమంది నెటిజెన్స్. దీనిపై క్లారిటీ దీప్తి సునైనానే ఇవ్వాలి.