Deepika Padukone : తన వాచ్ మన్ తో దీపిక సింప్లిసిటీ.. ఫిదా చేసిన స్టార్

Deepika Padukone

Deepika Padukone

Deepika Padukone : బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకునే ఏజ్ పెరుగుతున్నా అందం ఏమాత్రం తగ్గడం లేదు. రణవీర్ తో పెళ్లి తర్వాత మరింత గ్లామర్ డోస్ పెంచింది. హాట్ హాట్ బోల్డ్ సీన్స్ తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. అందం, అభినయంతో బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. 38ఏండ్లు దాటినా వరుస చాన్స్ లతో  దుమ్మురేపుతోంది.

ఒక్క సినిమాకే కోట్ల రూపాయలు పారితోషికం తీసుకునే దీపికా సింప్లిసిటీకి మారుపేరు. కాస్ట్ లీ బట్టలు వేసినా, లగ్జరీ లైఫ్ గడిపినా ఆమె ఆలోచనలు మాత్రం సగటు మహిళలాగానే ఉంటాయి. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన కొన్ని కీలక విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కెరీర్ బిగినింగ్ లో చాలా కష్టపడ్డానని చెప్పింది. షూటింగ్ లో అలసిపోయి క్యాబ్ లోనే నిద్రపోయేదాన్నని తెలిపింది. తాను, చెల్లి నిరాడంబరంగా పెరిగామని చెప్పింది. తమను చాలా సింపుల్ గా తమ తల్లిదండ్రులు పెంచారంది.

తనతో పాటు తన భర్త రణవీర్ కూడా చాలా సింపుల్ గా ఉంటారని, పెద్దగా  ఆర్భాటాలకు వెళ్లరని చెప్పింది. తమ బంధువులు ‘‘నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నానని..’’ అంటుంటారు అని చెప్పుకొచ్చింది. ఇంట్లో తాను సగటు మహిళలాగానే ఉంటానని తెలిపింది. తనకు డికాప్రియో అంటే ఎంతో ఇష్టమని.. తన రూమ్ నిండా ఆయన పెద్ద పెద్ద పోస్టర్లు అతికించుకున్నానని చెప్పింది. తీరిక దొరికితే ఇంటి పనులు చేసుకుంటానని తెలిపింది.

ఇదిలా ఉండగా ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ ఫొటోను చూస్తే తాజా ఇంటర్వ్యూలో దీపికా చెప్పిన విషయాలు వంద శాతం నిజమే అనిపిస్తుంది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే.. తన ఇంటి వాచ్ మన్ తో పై చేయి వేసి దీపికా అతడితో మాట్లాడుతోంది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. దీపికా సింప్లిసిటీని మెచ్చుకోవాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు. పెద్ద సెలబ్రిటీ అయ్యుండి కూడా వాచ్ మన్ తో ఓ ఫ్రెండ్ లాగా ఉండడం గొప్ప విషయమంటున్నారు.

TAGS