Deepika Padukone : ఇటీవల వచ్చిన కల్కి 2898 ఏడీ గురించి ఎంత మాట్లాడినా ఇంకా మిగిలే ఉంటుంది. సినిమా హాలీవుడ్ రేంజ్ ను మించి పోయింది. లీడ్ రోల్స్ లో ప్రభాస్-దీపికా పదుకొణె నటించారు. అవతారం చాలించిన శ్రీకృష్ణుడు 6వేల సంవత్సరాల తర్వాత మళ్లీ పుడుతాడు. ఆయన రాకకోసం ఎంతో మంది యుగాలుగా వేచి చూస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదీ స్టోరీ. కానీ, సినిమా 3 గంటల ప్రతీ సన్నివేశం గూస్‌బంబ్సే వీఎఫ్ఎక్స్ వర్క్ అదరహో అనిపించేలా తీశారు దర్శకుడు నాగ్ అశ్విన్.
ఈ సినిమాకు సంబంధించి ఒక్కో సంచలన విషయం బయటకు వస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు దీపికా పదుకొణె కడుపు గురించి ఒక వార్త సంచలనంగా మారింది. పైగా ఈ వార్తను ఒక డాక్టర్ చెప్పడం మరింత ఆజ్యం పోసింది. అదేంటంటే ఈ మూవీలో దీపికా పదుకొణె ‘బేబీ బంప్ ఫేక్’ అని చెప్పింది. ఒక డాక్టర్ ఇలా చెప్పడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దీపికా కల్కి ప్రపోషన్ లో కూడా బేబీ బంప్ తో పాల్గొన్నారు. అయితే ఆమె ప్రెగ్నెన్సీ ఫేక్ అని ఓ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. దానికి కారణం కల్కి ప్రమోషన్స్ లో ఆమె బేబీ బంప్ ఎక్స్ పోజ్ చేయడమే. నిజానికి ప్రెగ్నెంట్ గా ఉన్నవాళ్లు హై హీల్స్ వేసుకోవద్దు. కానీ దీపిక హై హీల్స్ వేసుకుంది. అంతేకాదు ఫ్యాషన్ డ్రెస్సులు కూడా వేసుకుంది. దీనికి తగ్గట్టే బేబీ బంప్ సైజు ఏదో కృత్రిమంగా అమర్చినట్లే ఉంది కానీ నాచురల్ ప్రెగ్నెన్సీగా కనిపించడం లేదు. ఇదే విషయాన్ని హాట్ టాపిక్ గా మార్చేశారు ఐవీఎఫ్ నిపుణురాలు డాక్టర్ గౌరీ అగర్వాల్. దీపికా కడుపుతో ఉందా? అన్న అనుమానం వ్యక్తం చేశారు. నిజంగానే ఆమె కడుపుతో ఉందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు.