JAISW News Telugu

Deepika’s Bikini Treat:బీచ్ ఇసుక‌లో మ్యారీడ్ బ్యూటీ ఘాటైన‌ శృంగారం

FacebookXLinkedinWhatsapp

Deepika’s Bikini Treat:హృతిక్ – దీపిక జంట‌గా న‌టించిన ఫైట‌ర్ 2024 మోస్ట్ అవైటెడ్ సినిమాల జాబితాలో ఉంది. భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 జనవరి 25న ఫైటర్ 2D, 3D, ఐమ్యాక్స్‌ 3Dలలో విడుదల కానుందని స‌మాచాం. వార్ ఫేం సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాని అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు. ఫైట‌ర్ తొలి భార‌తీయ‌ వైమానిక ద‌ళ చిత్రం కావ‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ ఇటీవ‌ల ఊపందుకున్నాయి. తాజాగా ఇష్క్ జైసా పేరుతో రిలీజైన సాంగ్ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. ముఖ్యంగా ఈ పాటలో గ్రీక్ గాడ్ హృతిక్ రోష‌న్ తో పొడుగుకాళ్ల సుంద‌రి దీపిక ప‌దుకొనే రొమాన్స్ మ‌రో స్థాయిని ట‌చ్ చేసింది. బికినీ బీచ్ లో దీపిక‌- హృతిక్ పెద‌వి ముద్దులు, ఘాటైన శృంగారంతో ర‌క్తి క‌ట్టించిన ఫోటోలు ఇప్పుడు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. యూత్ పదే ప‌దే షేరింగుల‌తో ఫైట‌ర్ శృంగార గీతానికి కావాల్సినంత ప్ర‌మోష‌నల్ సాయం చేస్తున్నారు.

ఇటీవ‌ల ప‌ఠాన్- జ‌వాన్ చిత్రాల్లో సీనియ‌ర్ హీరో షారూఖ్ తో దీపిక ఘాటైన రొమాన్స్ సంచ‌ల‌నంగా మారింది. దీపిక ప‌దుకొనే వేడెక్కించే గ్లామ‌ర్ స్ట‌న్నింగ్ స్టంట్స్ యువ‌త‌రంలో చ‌ర్చ‌గా మారాయి. మ‌ళ్లీ ఫైట‌ర్ లో హృతిక్ తో రొమాన్స్ మ‌తులు చెడ‌గొడుతోంది. ఈ ఇద్ద‌రి సంబంధం చూస్తుంటే గెహ్ర‌యాన్ ని త‌ల‌పిస్తోందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌స్తుతం దీపిక‌-హృతిక్ జంట ఘాటైన శృంగార స‌న్నివేశాలు, పెద‌వి ముద్దుల‌కు సంబంధించిన ఫోటోల‌ను యువ‌త‌రం వాట్సాప్ లు, సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు. వీటికి లైక్ లు క్లిక్ లు హోరెత్తుతున్నాయి. మ్యారీడ్ బ్యూటీ దీపిక‌కు డిజిట‌ల్ గా ఉన్న అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ఈ రొమాన్స్ కి స్పెల్ బౌండ్ అయిపోతున్నారు.

FIGHTER: Ishq Jaisa Kuch (Song) Hrithik Roshan, Deepika Padukone | Vishal-Sheykhar,Shilpa,Kumaar

Exit mobile version