Minister Nadendla : 50 లక్షల మైలురాయిని చేరిన దీపం-2 పథకం: మంత్రి నాదెండ్ల

Minister Nadendla
Minister Nadendla : ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన దీపం-2 పథకం లబ్ధిదారుల సంఖ్య మూడు వారాల్లోనే 50 లక్షల మైలురాయిని చేరుకుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శుక్రవారం విజయవాడ, కృష్ణలంకలోని కోత మిషన్ రోడ్డు ప్రాంతంలో జరిగిన దీపం-2 ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతుదని అన్నారు. అత్యంత పారదర్శకంగా ఈ పథకం కొనసాగుతుందని చెప్పారు. ఈ పథకంపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అధికారులతో కలిసి మంత్రి దీపం పథకం లబ్ధిదారులైన ఎం.కోటేశ్వరమ్మ కుటుంబ సభ్యులతో ముచ్చటించారు.