Pooja Hegde : నిన్న మొన్నటి వరకు వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఇండస్ట్రీ లో నెంబర్ 1 స్థానం లో కొనసాగిన హీరోయిన్ గా పూజ హెగ్డే టైం ఎలా నడిచిందో మన అందరికీ తెలిసిందే. కానీ ఏ హీరో/ హీరోయిన్ కి అయినా హిట్స్ తో పాటుగా ఫ్లాప్స్ కూడా తప్పవు. పూజ హెగ్డే కి అలా ఎన్ని సూపర్ హిట్స్ వచ్చాయో, అన్ని అట్టర్ ఫ్లాప్ సినిమాలు కూడా వచ్చాయి. వరుసగా ఫ్లాప్స్ రావడం తో ఆమెకి ఇండస్ట్రీ లో అవకాశాలు తగ్గిపోయాయి అనుకున్నారు.
కానీ అది నిజం కాదు, ఫ్లాప్స్ వచ్చినప్పటికీ కూడా అవకాశాలు వచ్చాయి. నిన్న విడుదలైన ‘గుంటూరు కారం’ చిత్రం లో హీరోయిన్ గా మొదట పూజ హెగ్డే ని తీసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం లో కూడా ముందుగా పూజ హెగ్డే ని తీసుకున్నారు.
కానీ ఈ రెండు సినిమాల నుండి స్వయంగా ఆమెనే తప్పుకుంది. కారణం ఆమెకు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చెయ్యడం వల్లే అని అప్పట్లో రూమర్ ఉండేది. కానీ ఆమె సినిమాలకు దూరంగా ఉన్నది అందుకోసం కాదట. తన అమ్మమ్మ రీసెంట్ గానే చనిపోయిందట. చిన్నప్పటి నుండి పూజా హెగ్డే కి తన అమ్మమ్మ తో ఉన్న సాన్నిహిత్యం ఇంట్లో అందరికంటే ఎక్కువ. అలాంటి అమ్మమ్మ చనిపోవడం తో పూజా హెగ్డే మానసికంగా ఎంతగానో కృంగిపోయిందట. కొన్ని రోజులు ఎవరితోనూ మాట్లాడలేదట. ఏ పని మీద పూర్తిగా శ్రద్ద చూపించలేకపోయిందట. ఆమె అస్వస్థతతో ఉన్నప్పటి నుండి పూజా హెగ్డే ఇలాగే ఉన్నింది అట.
ఇక ఇటీవల ఆమె చనిపోవడం తో ఆ బాధ ఇంకా ఎక్కువై ఏ షూటింగ్స్ లో కూడా పాల్గొనకుండా ఇంట్లోనే ఉంటుందట. ఇకపోతే నిన్న ఆమె తన అమ్మమ్మ ని గుర్తు చేసుకుంటూ ‘మిస్ యూయూ అజ్జి’ అంటూ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ పోస్ట్ లో ఆమె తన అమ్మమ్మ ని ఎంతలా మిస్ అవుతుందో అర్థం అవుతుంది. ఇకపోతే పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో ఒక సినిమా చేస్తుంది. గత ఏడాది లో మొదలైన ఈ సినిమా , అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.