Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం!!

Bhatti Vikramarka Brother
Bhatti Vikramarka Brother : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు అనారో గ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. హైదరాబా ద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందు తూ ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో డిప్యూటీ సీఎం విక్రమార్క ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.
భట్టి విక్రమార్క సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు హోమియోపతిలో ఎండి చదివి ఆయుష్ శాఖలో ప్రొఫెసర్ గాను, అడిషనల్ డైరెక్టర్ గానే పని చేసి రిటైర్ అయ్యారు. అనంతరం ఆయన వైరా నుండి ఒకటవ వార్డులో తన నివాసంలోనే హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. మంచి హోమియో వైద్యునిగా ఆయనకు ప్రజల వద్ద గుర్తింపు ఉంది.
మల్లు వెంకటేశ్వర్లు వద్ద వైద్యం చేయించుకోవ డానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండి రోగులు వస్తారు. సామాజిక బాధ్యతతో వచ్చిన వారందరికీ వైద్య సేవలు ఆయన అందించేవారు. డబ్బు కోసం కాకుండా వైద్యుడిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఆయన విశేషమైన సేవలు అందించారు.