JAISW News Telugu

Deep fake : డీప్ ఫేక్ తో రూ. 88 లక్షల స్కాం.. ఇద్దరి నుంచి కొల్లగొట్టిన స్కామర్లు..

Deep fake

Deep fake

Deep fake : టెక్నాలజీ ఎంత పెరుగుతుందో మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. గతంలో ఖాతాల్లో డబ్బును కాజేసేందుకు స్కామర్లు ఫోన్లు చేసి ఓటీపీలు చెప్పించుకొని డబ్బు కొల్లగొట్టే వారు. ఇలా స్కామర్లు మోసాలు జరుగుతున్నాయన్న విషయం జనాలకు తెలిసిపోయింది. దీంతో ఫోన్ల ద్వార మోసాలు చేయడం తగ్గించారు. ఇక ఏఐ టెక్నాలజీ కూడా అందుబాటులోకి రావడంతో డీప్ ఫేక్ ద్వారా స్కామర్లు ప్రజలను మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నారు. ఇటీవల బెంగుళూరులోని సైబర్ ఎకనామిక్ అండ్ నార్కోటిక్స్ (CEN) సౌత్ పోలీస్ స్టేషన్‌కు రెండు కేసులు వచ్చాయి. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి, రియలన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహిస్తున్నట్లు డీప్ ఫేక్ క్రియేట్ చేశారు. దీంతో బనశంకరికి చెందిన ఒక మహిళ, మరో రిటైర్డ్ ఉద్యోగి మోసపోయారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ గా మారిన ఈ వీడియోలు, వ్యాపార దిగ్గజాలు లాభదాయకమైన పెట్టుబడి అవకాశాల గురించి మాట్లాడినట్లు ఉంది.

దీనిని చూసిన బనశంకరికి చెందిన మహిళ దానిలోని లింక్‌పై క్లిక్ చేసి, వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యింది. ఆ తర్వాత ఆమెను ఏజెంట్ సంప్రదించి గణనీయమైన రాబడికి ఉందని డబ్బు పెట్టుబడి పెట్టాలని ఒప్పించింది. దీంతో సదరు మహిళ రూ. 67 లక్షలు కోల్పోయింది. మరో రిటైర్డ్ ఉద్యోగి ముఖేష్ అంబానీ డీప్‌ ఫేక్ వీడియో వీక్షించి స్కామ్‌కు గురయ్యాడు. ఆయన రూ. 19 లక్షలను పోగొట్టుకున్నాడు. ఈ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు.

Exit mobile version