CM Chandrababu : సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు (బుధవారం) ఏలూరులో పర్యటిస్తున్నారు. తమ్మిలేరును పరిశీలించిన అనంతరం ఆయన సీఆర్ రెడ్డి కాలేజీ ఆడిటోరియంలో వరదలకు నష్టపోయాన రైతులు, వరద బాధితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీలోపు నష్ట పరిహారంపై నిర్ణయి తీసుకుంటామని, వరికి మాత్రతం ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణంపై సీరియస్ గా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
వరదల వలన నష్టపోయిన అందరినీ ఆదుకుంటామని స్పష్టం చేశారు. తాను, తన మిత్రుడు పవన్ కల్యాణ్, బీజేపీలు (కూటమి ప్రభుత్వం) సుపరిపాలన అందిస్తామని, కౌలు రైతుల ఖాతాల్లోకి నేరుగా ఇన్ పుట్ సబ్సిడీ వేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.