JAISW News Telugu

South Africa : భారత్ కొంపముంచిన సౌతాఫ్రికా నిర్ణయం!

South Africa

South Africa

South Africa : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-2025 ఆసక్తిగా సాగుతోంది. గతానికంటే భిన్నంగా ఈ సారి టాప్-2 కోసం పోటీ పెరిగింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా నిర్ణయం భారత్ కు  ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ పై వైజాగ్ టెస్టు విజయంతో రెండో స్థానానికి వెళ్లిన భారత్ 2 రోజుల వ్యవధిలో 3 స్థానానికి పడిపోయింది.

అసలేం జరిగింది..
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో న్యూజిలాండ్ 281 పరుగుల తేడాతో విజయం సాధించింది. 529 పరుగుల లక్ష్యంతో ఈ రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా 247 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. దీంతో కివీస్ డబ్ల్యూటీసీ టేబుల్‌లో టాప్‌కు చేరింది. ప్రస్తుత ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు మూడు టెస్టులు ఆడిన న్యూజిలాండ్ 2 విజయాలు సాధించింది. 66.66 గెలుపు శాతంతో, 24 పాయింట్లతో టాప్ లో నిలిచింది.

మరోవైపు ఆస్ట్రేలియా (55 శాతం; 66 పాయింట్లు), భారత్ (52.77  శాతం, 38 పాయింట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. సౌతాఫ్రికాపై గెలుపుతో కివీస్ పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లడం బాగానే ఉంది. కానీ న్యూజిలాండ్ పర్యటనకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అనుభవం లేని ఆటగాళ్లను పంపింది. 14 మంది కలిగిన జట్టులో సగం మందికి అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. కెప్టెన్‌ నీల్ బ్రాండ్ కూడా అరంగేట్రం చేయని ఆటగాడే కావడం గమనార్హం.

టీ-20 లీగ్ కోసం సౌతాఫ్రికా ప్రధాన ఆటగాళ్లను సెలక్ట్ చేయలేదు. ఈ విషయంలో బోర్డుపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ‘టెస్ట్ క్రికెట్‌ పై గౌరవం ఉంది కానీ, క్లిష్టమైన షెడ్యూల్‌తో ఇలా చేయాల్సి వచ్చింది’ అని సౌతాఫ్రికా బోర్డు వివరణ ఇచ్చింది. ఆ తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. సౌతాఫ్రికా నిర్ణయం ఇప్పుడు టీమిండియాపై ప్రభావం చూపనుంది.

ఫిబ్రవరి 13 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే చివరి టెస్టులో న్యూజిలాండ్‌ ఫేవరేట్‌ గా మారింది. ఆ మ్యాచ్ విజయంతో కివీస్ గెలుపు శాతం 75కు చేరుతుంది. ఇది టీమిండియాతో పాటు ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, భారత్, బంగ్లాదేశ్ (50  శాతం; 12 పాయింట్లు), పాకిస్తాన్ (36.66 శాతం; 22 పాయింట్లు) టాప్-5లో ఉన్నాయి.

Exit mobile version