PM Modi : అజర్ బైజాన్ దేశ పర్యటన ముగించుకుని ఇరాన్ తిరిగి వెళ్తుండగా ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్ర హుస్సేన్ అమిరబ్దొల్లాహియాన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అధ్యక్షుడు రైసీతో పాటు మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం రైసీ విషాద మరణం పట్ల భారత ప్రధాని మోదీ తీవ్ర విచారం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసి కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అతని కుటుంబానికి, ఇరాన్ ప్రజలకు నా హృదయపూర్వక సానుభూతి. ఈ విషాద సమయంలో భారత్ ఇరాన్ కు అండగా నిలుస్తుంది’’ అని ప్రధాని మోదీ తన ట్వీట్ లో తెలిపారు.
ఈ విషయంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన ఈ ఏడాది జనవరిలో రైసీ, అబ్డోల్లాహియాన్ లతో నిర్వహించిన సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఇరాన్ ప్రజలతో న్యూఢిల్లీ నిలబడి ఉంటుందని పేర్కొన్నారు.