DC VS MI : ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబయి ఇండియన్స్ మధ్య కీలకపోరు
DC VS MI : ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబయి ఇండియన్స్ మధ్య అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కీలక పోరు ప్రారంభం కానుంది. ముంబయి జట్టు 8 మ్యాచుల్లో 3 మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ 8 మ్యాచ్ ల్లో 4 మ్యాచులే గెలిచి ఆరో స్థానంలో ఉంది. కాగా ఈ రెండు టీమ్ లకు ఇది చాలా కీలకమైన మ్యాచ్.
ముంబయి ఇండియన్స్ టీంలో సూర్య కుమార్ యాదవ్ ఫామ్ లోకి రావాల్సి ఉంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా సరైన ఫామ్ లో లేక జట్టుకు భారంగా మారుతున్నాడు. మిడిలార్డర్ లో తిలక్ వర్మ, వాదేరా ఇద్దరు గత మ్యాచ్ లో రాణించినా ఆ టోటల్ ను రాజస్థాన్ రాయల్స్ సింపుల్ గా ఛేజ్ చేసేసింది. బుమ్రా ఒక్కడే బౌలింగ్ లో ప్రతి మ్యాచ్ లో తక్కువ రన్స్ ఇస్తున్నాడు. మిగతా బౌలర్లు దారాళంగా పరుగులు ఇవ్వడంతో ముంబయి ఇండియన్స్ కు గెలవడం కష్టమవుతుంది.
ఢిల్లీ టీంకు గత మ్యాచ్ లో రిషబ్ పంత్ ఫామ్ లోకి రావడం కలిసొచ్చే అంశం. గుజరాత్ బౌలింగ్ ను పంత్ తుత్తునియలు చేశాడు. చివరి ఓవర్ లో మోహిత్ శర్మ బౌలింగ్ ను ఉతికి ఆరేశాడు. మొత్తం ఒకే ఓవర్ లో ముఫ్పై పైగా పరుగులు సాధించి ఢిల్లీకి భారీ స్కోరు అందించాడు. ఢిల్లీ బ్యాటింగ్ గాడిలో పడినప్పటికీ బౌలింగ్ లో ఇంకా మార్పు రావాల్సి ఉంది. ఖలీల్ అహ్మద్ తో పాటు మిగతా బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయాల్సిన అవసరముంది.
రెండు జట్లకు ఇది కీలకమైన మ్యాచ్.. ఢిల్లీ ఇప్పటికే నాలుగు విజయాలు సాధించింది. ఇంకా అయిదు మ్యాచులు ఉన్నాయి. అయిదు మ్యాచులు గెలిస్తే ప్లే ఆప్ కు నేరుగా వెళ్లే అవకాశం ఉంది. ముంబయి ఇండియన్స్ కు ఆరు మ్యాచులు ఉన్నాయి. ఇది కూడా ఆరు మ్యాచులు గెలిస్తే నేరుగా ప్లే ఆప్ కు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇక్కడి నుంచి ఒక్క మ్యాచ్ ఓడిపోయినా.. రెండు జట్లు మిగతా జట్ల ఫర్ఫామెన్స్ పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.