JAISW News Telugu

Extra Marital Affairs : రోజు రోజుకు పెరుగుతున్న వివాహేతర సంబంధాలు.. సర్వేలు ఏం చెప్తున్నాయంటే?

Facebook
X
Linkedin
Whatsapp
Extra Marital Affairs

Extra Marital Affairs

Extra Marital Affairs : భారతీయ ధర్మంలో వివాహానికి ప్రత్యేక స్థానం ఉంది. పుట్టుక తర్వాతి అపూర్వ ఘట్టంగా దీన్ని పరిగణిస్తారు. అందుకే ప్రపంచం యావత్తు భారతీయ వివాహ వ్యవస్థను ఇష్ట పడతారు. కానీ క్రమం క్రమంగా పరిస్థితులు మారిపోతున్నాయి. వివాహం స్థానంలో వివాహేతర సంబంధం వచ్చి చేరింది. ఇటీవల నిర్వహించిన ఒక సర్వే వివరాలు బహిర్కతం చేయడంతో వివాహ వ్యవస్థ గురించి షాకింగ్ వాస్తవం వెల్లడైంది.

ఇటీవల వివాహేతర సంబంధం (డేటింగ్)పై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. దేశంలోని వివాహిత పౌరులు ఇప్పుడు డేటింగ్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని సర్వేలో స్పష్టమైంది.

‘గ్లిడెన్’ అనే సంస్థ వివాహం.. మోసం, సంస్కృతిక విలువలపై భారతదేశం యొక్క మారుతున్న వైఖరిపై అధ్యయనం చేసింది. ఇందులో టైర్ 1, టైర్ 2 నగరాల నుంచి 25 నుంచి 50 సంవత్సరాల వయస్సున్న 1503 మంది వివాహితులు పాల్గొన్నారు.

గ్లిడెన్ అధ్యయనంలో.. పాల్గొన్న వారిలో 60 శాతం కంటే ఎక్కువ స్వింగ్ వంటి సంప్రదాయేతర డేటింగ్ పద్ధతిని ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. స్వింగ్ అంటే వివాహం అనంతరం భాగస్వామిని మోసం చేసే పద్ధతి. ప్రస్తుతం దేశంలో ఇదే జరుగుతుందట.

ముఖ్యంగా శారీరక సంబంధం కోసమే ఇలా వ్యవహరిస్తున్నారట. ఒకరిని వివాహం చేసుకొని మరో వ్యక్తితో మానసికంగా అనుబంధం ఉంటే, అది మోసం కిందకే వస్తుంది. 46 శాతం మంది పురుషులు ఇలాంటి సంబంధాలను ఇష్టపడుతున్నారని తేలింది. వీరిలో ఎక్కువ మంది కోల్‌కతాకు చెందిన పురుషులు ఉన్నారట.

ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో రిలేషన్ షిప్ చీటింగ్‌లో భాగంగా మరింది. ఈ అధ్యయనం ప్రకారం.. 36 శాతం మంది మహిళలు, 35 శాతం మంది పురుషులు వర్చువల్ ఫ్లర్టింగ్‌ ఇష్టపడుతున్నారట. కొచ్చిలో అధిక శాతం డిజిటల్ రొమాన్స్ చేస్తున్నారట.

ఈ అధ్యయనం ప్రకారం.. దేశంలో 33 శాతం మంది పురుషులు, 35 శాతం మంది స్త్రీలు ఇతరులతో కలిసి ఉండాలనే ఫాంటసీని జీవిస్తున్నారంట. ఇతరులతో శారీరక బంధం పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారట.

Exit mobile version