Viral Video : మామను చితకబాదిన కోడలు.. వీడియో వైరల్..
Viral Video : రాను రాను మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. వివాహాలంటేనే పురుషులు భయపడుతున్నారు. గతంలో భార్యలు ఇంటి పనులు, ఇంట్లోని పెద్దల అవసరాలను చూసుకునేవారు. కానీ జమానా మారింది.. పెద్దలను డస్ట్ బిన్ కన్నా అధ్వానంగా చూస్తూ.. వృద్ధాశ్రమాల్లో విడిచిపెట్టడం.. వారిపై చేయి చేసుకోవడం ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంది. వీటికి కారణం కూడా పురుషులదే అంటూ సమాజం కూడా వారినే ధూషిస్తుంది. ‘ఇంట్లో భార్య అయినా ఉండాలి.. తల్లిదండ్రులు అయినా ఉండాలి. ఇద్దరూ ఒకే దగ్గర ఉండడం కుదరదు అంటూ’ సోకాల్డ్ పర్సన్స్ చెప్పుకుంటున్నారు.
అత్తా, మామ సంపాదించుకునే వయస్సులో ఉంటే పర్వాలేదు. వారిని ఎక్కడో ఒక్క కాడ ఉంచవచ్చు. కానీ కనీసం పని చేసుకునే వయస్సులో లేని వారిని ఇబ్బందులు పెట్టడం సరైన పేనేనా? అని వాదనలు వినిపిస్తున్నాయి. ముదుసలి వాళ్లపై దాడులు చేయడం కొట్టడం కోడళ్లకు అలవాటుగా మారింది. అయ్యో కాళ్లు, చేతులు పని చేయని సమయంలో ఇంత ముద్ద పడేస్తుందని భావించి కొడుకుతో పాటు ఆస్తి పాస్తులు వారి చేతిలో పెడితే వీరికి మాత్రం వృద్ధాశ్రమాలు దిక్కవుతున్నాయి.
కర్ణాటకలో ఈ అమానవీయ ఘటన జరిగింది. మంగళూరుకు చెందిన ఉమా శంకరి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం చేస్తుండేవాడు. భర్త ఉద్యోగ రిత్యా విదేశాల్లో ఉండడంతో అత్తమామలతో కలిసి ఆయన భార్య ఉంటుంది. ఆమె మామ పద్మనాభ సువర్ణ (87) సోఫాపై షర్ట్ (చొక్కా) పెట్టాడన్న కోపంతో వాకింగ్ స్టిక్‌తో ముదుసలి వాళ్లు వాడే వాకింగ్ స్టిక్ తో విచక్షణా రహితంగా కొట్టింది. కొట్టడమే కాకుండా బలంగా నెట్టేయడంతో సోఫాకు తల తగిలి గాయమైంది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.
మార్చి 9 (శనివారం)న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరలైంది. ఈ దాడిని గల్ఫ్ లో ఉన్న తన భర్త సీసీ టీవీ ఫుటేజీ ద్వారా చూశాడు. ఈ క్రమంలో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. వృద్ధుల రక్షణకు కఠిన చట్టాలు, సంక్షేమ విధానాలు అవసరమని కొందరు నెటిజన్ అభిప్రాయపడ్డారు.
In a shocking incident, the #MangaluruPolice have arrested a woman for assaulting her father-in-law with a walking stick at #Kulshekar, #Mangaluru, on March 11.
The arrested has been identified as #Umashankari from Kulshekar.
According to the police, Umashankari, an officer in… pic.twitter.com/drqZPwCSi4
— Hate Detector 🔍 (@HateDetectors) March 11, 2024