Daughter-in-law : కోడలే కొడుకయింది.. మామయ్యకు తలకొరివి పెట్టింది..

Daughter-in-law
Daughter-in-law : చివరి రోజుల్లో ఓ వృద్ధుడికి కోడలే కొడుకయింది. మామయ్యకు కొడుకు లేని లోటు తల కొరివి పెట్టి రుణం తీర్చుకుంది. ఆఖరి మజిలీలో ఆ వృద్ధుడికి ఇచ్చిన మాట ప్రకారం తల కొరివి పెట్టింది. ఏలూరు తూర్పు వీధికి చెందిన వ్యవసాయ శాఖ విశ్రాంత ఉద్యోగి ఎర్రంశెట్టి నరసింహారావు కుమారుడు కొంతకాలం క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి నరసింహారావు బాగోగులు ఆయన కోడలు చూస్తున్నారు.
తాను చనిపోతే కోడలు తలకొరివి పెట్టాలనేది ఆయన కోరిక. నరసింహారావు మృతి చెందడంతో ఆయన కోరిక మేరకు కోడలు అంత్యక్రియలు నిర్వహించింది.