Date With Ram Charan : రామ్ చరణ్ తో డేటింగ్ చేయాలని ఉంది.. బిగ్ బాస్ సరయు బోల్డ్ కామెంట్లు..!

Date With Ram Charan bold Comments by sarayu Roy
Date With Ram Charan : బిగ్ బాస్ బ్యూటీలు బయటకు వచ్చిన తర్వాత మాత్రం చాలా బోల్డ్ గా ప్రవర్తిస్తున్నారు. బిగ్ బాస్ కు వెళ్లక ముందు కాస్త పద్ధతిగా ఉండే వారంతా.. బయటకు వచ్చిన తర్వాత మాత్రం బోల్డ్ అందాలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్నారు. అంతే కాకుండా బోల్డ్ మాటలతో కుర్రాళ్లకు వేడి పుట్టిస్తున్నారు. ఇలాంటి వారిలో బిగ్ బాస్ సరయు కూడా తప్పకుండా ఉంటుంది.
ఆమె యూట్యూబ్ లో బోల్డ్ కంటెంట్ ఉన్న వీడియోలు, బూతు మాటలతో చాలా ఫేమస్ అయింది. ఆమె తర్వాత అలా బూతులు మాట్లాడే వీడియోలు చాలా మంది చేసినా ఆమెకు వచ్చినంత గుర్తింపు మాత్రం రాలేదు. ఇక ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ కు వెళ్లి అక్కడ కూడా మంటలు రేపింది. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తోంది. ఈ క్రమంలోనే తాజా ఇంటర్వ్యూలో తనలోని బోల్డ్ నెస్ ను బయట పెట్టేసింది.
నీకు ఏ హీరో అంటే ఇష్టం అని యాంకర్ ఓ ప్రశ్న వేసింది. దానికి సరయు మాట్లాడుతూ… నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. ఆయన్ను నేను ఎంతగానో ఆరాదిస్తూ ఉంటాను. రామ్ చరణ్ లాంటి భర్త రావాలని నేను చాలా సార్లు కోరుకున్నాను. ఆయన ఒప్పుకుంటే కనీసం ఒక్కరోజు అయినా గర్ల్ ఫ్రెండ్ లాగా ఉండాలని నాకు ఉంది.
అంతే కాదు అతనితో డేటింగ్ చేయలనే కోరిక కూడా ఉంది అంటూ తన మనసులోని ఘాటు కోరికలను బయట పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తాను ఇప్పటికీ పెండ్లి చేసుకోలేదని తెలిపింది సరయు. అయితే పెండ్లి కాకపోయినా తాను మాత్రం వర్జిన్ ను కాదంటూ క్లియర్ గా చెప్పేసింది. తాను ఎప్పుడో తన బాయ్ ఫ్రెండ తో శృంగారంలో పాల్గొన్నానని పచ్చిగా మాట్లాడింది.