Tirumala Darshan Scam : మేం నాణ్యమైన పాలన అందిస్తాం. ప్రతి ఒక్కరికి మేలు చేస్తాం.. మమ్మల్ని మరో 30 సంవత్సరాలు ప్రజలు గుర్తు పెట్టుకుంటారని బీరాలు పోయిన వైసీపీ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు చావు దెబ్బ కొట్టారు. అసలు ఎందుకిలా జరిగిందని ఆ పార్టీ విశ్లేషించుకుంటోంది. నిజంగానే గత ప్రభుత్వం అలాంటి పాలనే అందిస్తే ప్రజలు మళ్లీ ఎందుకు గెలిపించుకోకుండా ఉంటారు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించుకోవాలని పలువురు సూచిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వం కనీసం దేవుడిని కూడా వదల్లేదు. దేవుడిని వాళ్లు ఎలా దోచుకున్నారో విజిలెన్స్ బయటకు తీస్తోంది. మిగతా విషయాలు పక్కన పెడితే అసలు దర్శనం పేరుతో ఎలా దోపిడీ చేశారో ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయి. టీటీడీ కొత్త ఈవో శ్యామలరావు విజిలెన్స్ బృందాలకు పెద్ద పని అప్పజెప్పారు. నాలుగైదు విభాగాలుగా చేసి అన్నింటిలోనూ లెక్కలు బయటకు తీయిస్తున్నారు. ఇలా దర్శనాల్లో చేసిన దందాల గురించి ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధుల పేర్లతో వచ్చిన సిఫారసు లేఖలు వెలుగులోకి భారీగా వెలుగులోకి వస్తున్నాయి.
కొద్ది రోజుల కిందట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్క లేఖ మీద వంద మందిని వీఐపీ దర్శనానికి పంపించమని సిఫారసు లేఖ పంపించిన విషయం వెలుగు చూసింది. రీసెంటుగా పెద్దిరెడ్డి కూడా అలాంటి లేఖలు రాసి వందల మందిని దర్శనానికి పంపించమని పురమాయించారు. ఇలాంటి దందాలు లెక్కలేనన్ని సాగాయని ఇదో పెద్ద బిజినెస్ గా అనేక మంది మార్చుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి రోజా కూడా ఈ దందాలో ఉన్నారు. ఆమె దర్శనాలను ఎలా అమ్ముకున్నారో లెక్కలను బయటకు తీస్తున్నారు. మామూలుగా వీఐపీ దర్శన టిక్కెట్ పదివేలు.. ఆ మొత్తం నేతలు వసూలు చేసి దర్శనాలకు జనాలను పంపిస్తున్నారు. ఇలా రోజుకు ఎంత మందిని పంపారన్నది లెక్కలు తీస్తున్నారు. ఎవరెవరు పంపారు.. అన్న వివరాలను సేకరిస్తున్నారు. రోజాతో పాటు దర్శనానికి ఎంత మంది వచ్చారు.. అనే వివరాలు కూడా వెలుగులోకి తీసుకొస్తున్నారు. దాదాపుగా ప్రతి వారం రోజా దర్శనానికి వచ్చేవారు. ఇలా దర్శనాల పేరుతోనే భక్తులను నిలువుదోపిడీ చేసినట్లు గుర్తించారు. తిరుమలలో బయటపడబోయే దందాలు.. సంచలనం సృష్టిస్తాయని టీటీడీ అధికారులు చెబుతున్నారు.