Darling remuneration : రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానానికి హద్దుల్లేవని నిరూపించాడు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అందరికీ చేరువవుతున్నాడు. ప్రతి సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాడు. బలమైన ఫిలిం బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కెరీర్ తొలినాళ్లలో దాదాపు ఐదారేళ్ల పాటు సాధారణ హీరోగానే కనిపించాడు. కానీ బిల్లా, బుజ్జిగాడు, మిర్చి సినిమాలతో తన రేంజ్ ఏంటో టాలీవుడ్ కు చూపెట్టాడు. అప్పటి దాకా ఉన్న ఒక్కో రికార్డును చెరిపేస్తూ వచ్చాడు.
ఇక బాహుబలితో ఇటు పాన్ ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అక్కడి నుంచి హిట్టు ప్లాఫులతో సంబంధం లేకుండా ప్రతీ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఇక రాబోయే సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యే వాటిలో కల్కి-2, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కనున్న స్పిరిట్. ఇప్పటికే స్పిరిట్ కోసం కొరియి యాక్షన్ స్టార్ ను విలన్ గా తీసుకోబోతున్నారని మొన్నటి దాకా టాక్ వచ్చింది. ఆ రూమర్లను అటు డైరెక్టర్ గానీ ఇటు హీరో ప్రభాస్ గానీ కొట్టిపారేయకపోవడంతో దాదాపు నిజం అవ్వొచ్చని అందరూ అనుకుంటున్నారు.
తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ (వర్కింగ్ టైటిల్) గురించి ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది. భారీ బడ్జెట్ తెరకెక్కడమే కాకుండా భారీ వసూళ్లను సాధించడం పక్కా అంటున్నారు డార్లింగ్ అభిమానులు. ఈ సినిమా కోసం ప్రభాస్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనని ఇండస్ర్టీలో టాక్ నడుస్తున్నది. రజినీకాంత్, తమిళహీరో దళపతి విజయ్ లను మించి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని హాట్ హాట్ చర్చ నడుస్తున్నది. ఈ సినిమా కోసం దాదాపు 250 కోట్ల వరకు ప్రభాస్ చార్జ్ చేస్తున్నాడని టాక్. మరి ఇంత భారీ రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్న ఇండియన్ హీరో ప్రస్తుతానికి ఎవరూ లేరు. ప్రస్తుతం ప్రభాస్ నెంబర్ వన్ హీరో అనే చర్చ కల్కి హిట్ తర్వాత నుంచి వినిపిస్తు్న్న విషయం తెలిసిందే.