Darling Prabhas : అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న హీరో ప్రభాస్
Darling Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తన తోటి నటీనటులతో పాటు పర్సనల్ స్టాఫ్, అభిమానులు ఆపదలో ఉంటే మిన్నకుండిపోడు. అప్పటికప్పుడు తనకు తోచినంత సాయం చేస్తూ ఆదుకొని అండగా నిలుస్తుంటారు. బాహుబాలి సినిమా ముందు నుంచి తన పర్సనల్ జిమ్ ట్రైనర్ గా వ్యహరిస్తున్న కోచ్ కు ఖరీదైన కారును గిఫ్ట్ గా తన గొప్ప మనసు చాటుకున్నాడు. ఇటీవల దర్శకుల దినోత్సవానికి రూ. 35 లక్షలు విరాళం ప్రకటించి స్టార్ హీరోలకు ఆదర్శంగా నిలిచారు రెబల్ స్టార్ ప్రభాస్. కోవిడ్ సంక్షోభ సమయంలో రెండు తెలుగు రాష్ర్టాలకు పెద్ద మొత్తంలో విరాళాలు అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఎంతో మందికి దానాలు చేసినా వాటి గురించి ఎప్పుడూ బయటకు చెప్పుకోలేదు.
అభిమానులకు అండగా..
ప్రభాస్ తన అభిమానులకు ఎప్పుడూ అండగా నిలుస్తున్నారు. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సమయంలో ప్రమాదవశాత్తూ ఓ అభిమాని చనిపోగా ఆ కుటుంబానికి తక్షణమే సాయం అందించాడు. అలాగే బాహుబలి సినిమా రిలీజ్ సమయంలో ఓ అభిమాని కరెంట్ షాక్ తో చనిపోగా, ఆ కుటుంబానికి సాయం అందించాడు ప్రభాస్. రెబల్ సినిమా చిత్రీకరణల సమయంలోనూ ఓ అనాథాశ్రమానికి పెద్ద మొత్తంలో విరాళం అందించి తనలోని మానవత్వాన్ని నిరూపించుకున్నారు.
కరీంనగర్ అభిమాని కుటుంబానికి అండగా..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సీపల్లి రమేష్ ఇటీవల బ్రెయిన్ స్ర్టోక్ తో చనిపోయాడు. అభిమానులు ఈ విషయాన్ని హీరో ప్రభాస్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన చలించిపోయాడు. వెంటనే ఆర్థిక సాయం అందించాలని తన పీఏ రామకృష్ణకు సూచించాడు. పీఏ రామకృష్ణ మే 25న కరీంనగర్ లో ప్రభాస్ అభిమాని సీపల్లి రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. హీరో ప్రభాస్ పంపిన ఆర్థిక సాయాన్ని అభిమాని కుటుంబ సభ్యులకు అందజేశారు. అధైర్య పడవద్దని, అండగా ఉంటామని భరోసా ఇచ్చి ఓదార్చారు. భవిష్యత్ లోనూ రమేష్ కుటుంబాన్ని కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.