Producer Ashwini Dutt : డేర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్..
Producer Ashwini Dutt : ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబలో వచ్చిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ డే 180 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా మనోసారి నిలబెట్టింది. పురాణాలు, సైన్స్ ఫిక్షన్ ను నాగ్ అశ్విన్ మిక్స్ చేసిన తీరు అత్యద్భుతం. సినిమా క్లైమాక్స్ కు వచ్చిన రెస్పాన్స్ ను బట్టి ఈ విషయం స్పష్టం అవుతోంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా చూసిన అశ్వనీదత్ డేర్ నెస్ చూసి, సినీ ఆడియన్స్, ఇండస్ట్రీ, మీడియా సైతం ఫిదా అవుతోంది. పాత తరంకు చెందిన ఏ ప్రొడ్యూసర్ కూడా ఇంత యాక్టివ్ గా ఉండి ఈ స్థాయిలో సినిమాలు చేయడం లేదు. అది పక్కన పెడితే అశ్వనీదత్ టీడీపీకి బలమైన మద్దతుదారుడు. ఇటీవల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరుతూ ప్రచారం చేశారు.
చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న సమయంలో సినీ పరిశ్రమ మౌనంగా ఉంటే ఒక్క అశ్వనీదత్ మాత్రమే చంద్రబాబును కలిసి బహిరంగంగా సంఘీభావం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలను అంచనా వేయడంలో ఉత్తమ సెఫాలజిస్టులు విఫలమయ్యారు. కానీ అశ్వనీదత్ మాత్రం ఈ విషయంలో విజయం సాధించారనే చెప్పాలి.
ఒక వేళ వైసీపీ గెలిచి ఉంటే జగన్ ప్రభుత్వం ‘కల్కి 2898 ఏడీ’కి భారీ షాక్ తగిలేది. అందుకే ఆయన ఎన్నికల తర్వాత చావో రేవో తేల్చుకోవాలి అనుకున్నాడు. అందుకు జూన్ లో రిలీజ్ అనౌన్స్ చేశాడు. కల్కి భారీ బడ్జెట్ చిత్రం. సినిమా స్థాయి, విజువల్స్, పెద్ద తెరపై కాస్టింగ్ చూశాక ఆ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది.
జగన్ అధికారంలోకి ఉంటే అశ్వనీదత్ పెద్ద చిక్కుల్లో పడేవారు. పవన్ కళ్యాణ్ సినిమాల నిర్మాతలను జగన్ ఏం చేశారో చూశాం. నాని సినిమాను కూడా ఇబ్బంది పెట్టడం వార్తల్లోకి వచ్చింది. ధరల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో పుష్ప పరాజయం పాలైంది. కాబట్టి జగన్ అధికారంలోకి వస్తే పరిణామాలు కల్కి విషయంలో దత్ కష్టాలు ఊహించలేనివిగా ఉండేవి.
ఈ సినిమా ఆయనకు భారీ వసూళ్లు రాబట్టాలని జనాలు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీకి ఓటేయాలని ఓటింగ్ రోజుకు ముందు అశ్వనీదత్ ఇచ్చిన సందేశాన్ని మీరు చూడవచ్చు. సినిమాలో వాడిన ఫేమస్ డైలాగ్ ‘రేపాటి కోసమ్’తో సందేశం ముగుస్తుంది.
Vote for a better tomorrow. #RepatiKosam @ncbn @JaiTDP pic.twitter.com/xV1OXp9SfH
— Chalasani Aswini Dutt (@AshwiniDuttCh) May 10, 2024