Jr. NTR : ఎన్టీఆర్ కు ప్రమాదం.. స్పందించిన టీమ్

 Jr. NTR

Jr. NTR

Jr. NTR Team : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కు తీవ్ర  గాయాలయ్యాలంటూ బుధవారం ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ పర్సనల్ టీమ్‌ స్పందించింది.  యాక్సిడెంట్ వార్తలను టీమ్ ఖండించింది.  ఎన్టీఆర్ సురక్షితంగా ఉన్నారని టీమ్ సభ్యులు స్పష్టం చేశారు. ‘‘జిమ్‌ లో ఎక్సర్ సైజ్    చేస్తుండగా ఎన్టీఆర్‌ ఎడమ చేతికి రెండు రోజుల క్రితం స్వల్ప గాయమైంది. ఆ గాయంతోనే ‘దేవర’ షూటింగ్‌లో మంగళవారం పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఎన్టీఆర్ కు పెద్ద ప్రమాదం జరిగినట్టు వస్తున్న వార్తలు అంతా అవాస్తవం. దయచేసి ఆ ప్రచారాలను నమ్మొద్దంటూ ఆయన వ్యక్తిగత టీమ్ విజ్ఞప్తి చేసింది.

ఎన్టీఆర్‌  ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara)లో నటిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణలో ప్రమాదం చోటుచేసుకుందని కొందరు, జూబ్లీహిల్స్ లో ప్రమాదానికి గురయ్యారంటూ మరికొంందరు ప్రచారాలు చేస్తుండగా టీమ్‌ స్పందించింది.

ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అటు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 చేస్తున్నాడు. మరో వైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రాన్ని ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.  ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై  రెండేళ్లు దాటింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ మళ్లీ తెర మీద కనిపించలేదు. ఎన్టీఆర్ ఒకేసారి వరుసగా మూడు సినిమాలు చేస్తుండడంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఇంతలోనే యాక్సిడెంట్ జరిగిందంటూ పుకార్లు రావడంతో ఆందోళనకు గురయ్యారు. ఎక్కడ జరిగింది. ఎలా జరిగింది.. కారణాలేంటని ఆరా తీయడం మొదలు పెట్టారు. ఎన్టీఆర్ వ్యక్తిగత వెంటనే స్పందించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

TAGS