Pope Francis : మానవ సంబంధాలను యాంత్రికంగా మార్చేసే ప్రమాదం – కృత్రిమ మేధపై పోప్ ఫ్రాన్సిస్ వ్యాఖ్యలు
Pope Francis : కృత్రిమ మేధ వంటి శక్తివంతమైన సాంకేతికత, మానవ సంబంధాలను యాంత్రికంగా మార్చేసే ప్రమాదం ఉందని పోప్ ఫ్రాన్సిస్ హెచ్చరించారు. ఇటలీలో జీ-7 సదస్సు నిర్వహిస్తుండగా అగ్ర నేతలంతా ఒక దగ్గరకు చేరారు. జీ-7 సదస్సును ఉద్దేశించి పోప్ ఫ్రాన్సిస్ ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కృత్రిమ మేధ వంటి శక్తివంతమైన సాంకేతికత, మానవ సంబంధాలను యాంత్రికంగా మార్చేసే ప్రమాదం ఉందని పోప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏఐని సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు. చాట్ జీపీటీ వంటి రూపాల్లో కృత్రిమ మేధ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ, దాని ప్రయోజనాలు, పొంచి ఉన్న ముప్పుల గురించి మాట్లాడిన ఆయన జీ-7 శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన తొలి పోప్ గా చరిత్రకెక్కారు.
కాగా, జీ-7 సమ్మిట్ లో భాగంగా అవుట్ రీచ్ సెషన్ లో పోప్ ఫ్రాన్సిస్ తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్, మోదీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం వారిద్దరూ కొద్దిసేపు ముచ్చటించారు.