JAISW News Telugu

Senior Star Heroes : సీనియర్‌ స్టార్ హీరోలకు డేంజర్ బెల్‌.. కంటెంట్‌ బావుంటేనే సై.. లేదంటే నై.. ఇదే ఆడియన్స్ మాట..

Senior Star Heroes

Senior Star Heroes

Senior Star Heroes : మెగాస్టార్‌ చిరంజీవి ఇష్టంగా చేసిన సినిమా ‘ఆచార్య’. చిరంజీవి, ఆయన కొడుకు రాం చరణ్‌ కలిసి ఈ సినిమాలో నటించారు. ప్రీ రిలీజ్‌ టైములో చాలా హైప్‌ క్రియేట్ చేసింది. రీలీజుకు ముందు పాటలు కూడా దుమ్మురేపాయి. ఆర్ఆర్ఆర్‌ తర్వాత చెర్రీ ఖాతాలో పడే భారీ సినిమా అనుకున్నారు. కట్‌ చేస్తే థియేటర్లలో ప్రేక్షకులే కనిపించలేదు. కంటెంట్‌ వీక్‌ అయితే ఏం చేస్తామంటూ పెదవి విరిచారు. మెగా ఫ్యాన్స్ మాత్రం అన్న సినిమా అంటూ కొంచెం ఒకే అని చెప్పుకున్నారు.

ఆచార్యతో పోలిస్తే భోళా శంకర్‌ పరిస్థితి మరీ దారుణ. మెహర్ రమేష్-మెగాస్టార్ కాంబోలో వచ్చిన ఈ మూవీ తమిళంలో ‘వేదాళం’కు రీమేక్. రిలీజైన రెండో రోజే థియేటర్లు ఖాళీ అయ్యాయి. ఇక్కడ కూడా కథనే కింగ్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు ఆడియన్స్.

ఇప్పుడు విశ్వంభర విషయంలో మరింత జాగ్రత్తగా.. ఆచితూచి అడుగులు వేస్తున్నారు మెగాస్టార్‌. ప్రతీ అంశాన్ని ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకుంటున్నారు. ఎలాగైనా ఈ సినిమాతోనైనా బౌన్స్ బ్యాక్‌ అవ్వాలనుకుంటున్నారు. విశ్వంభర రికార్డులు చూసి జనాలు విస్తుపోవాలని అందుకు తగ్గ ప్లాన్‌ చేసుకుంటున్నారు.

ఇక కమల్‌హాసన్‌ కూడా ‘థగ్‌ లైఫ్‌’ మీద ఫుల్ ఫోకస్‌ పెట్టారు. ‘కల్కి’లో యాస్కీన్‌ వైబ్‌ నుంచి జనాలు బయటకు రాకముందే ఇండియన్‌2 తో నిరాశ పరిచారు కమల్. ఇప్పుడు ఆ నెగటివిటీ మొత్తం తుడుచుపెట్టుకొని పోవాలంటే థగ్‌ లైఫ్‌ భారీగా ఉండాల్సిందే. మణిరత్నం మీద కోటి ఆశలు పెట్టుకున్నాడు కమల్ హాసన్.

తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో తలైవర్‌ రజినీకాంత్. ఆయన సినిమా ఫస్ట్ రోజు థియేటర్లలో జనాలు లేకపోవడం విడ్డూరం. దాన్ని కూడా చూసింది లాల్‌ సలామ్‌ యూనిట్‌. ఓపెనింగ్స్ కూడా లేవు ఆ సినిమాకు. ఘోర పరాజయాన్ని చవిచూసింది ఆ మూవీ. అప్పటి నుంచి మరింత అలర్ట్ అయ్యారు తలైవర్. జైలర్‌ చరిష్మా వేట్టయాన్‌తో కంటిన్యూ చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమాలు క్లిక్‌ అయితేనే తన తర్వాతి ప్రాజెక్టుల్లో జోష్‌ పెరుగుతుందన్న విషయం సీనియర్లకు చాలా బాగా తెలుసని స్టేట్‌మెంట్‌ ఇస్తున్నారు క్రిటిక్స్.

Exit mobile version