Mahesh Babu : మహేష్ బాబు తో శవాల దగ్గర డ్యాన్స్..స్టార్ డైరెక్టర్ వింత ఆలోచన!

Mahesh Babu
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం visionary డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళితో కలిసి ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. అయితే రీసెంట్‌గా నటుడు-దర్శకుడు బండి సరోజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.“నాకే మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ వస్తే, ఆయనతో శవాల దగ్గర డ్యాన్స్ చేయిస్తా. దేశంలో ఎవరూ చేయని క్యారెక్టర్ చేయించుతా” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. మహేష్ బాబు టాలెంట్‌కి అసలైన వేదిక ఇప్పటివరకు రావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.