NATS : డల్లాస్ లో.. నృత్యం, నటన ‘నాట్స్’ శిక్షణ శిబిరం

 NATS : మన దగ్గర చిన్నారులకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు  లలిత కళలు, నైపుణ్యాలపై ఉచితంగా శిక్షణ ఇస్తుంటాయి. పుట్టిన గడ్డపైనే ఉంటారు కాబట్టి వారికి భాష, ఇతర కమ్యూనికేషన్ స్కిల్స్ స్వతహగానే వస్తుంటాయి. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రత్యక్షంగా గమనిస్తుంటారు. పండుగలు, వేడుకల్లో పాల్గొంటూ మన తెలుగు సంస్కృతిని ఒంటపట్టించుకుంటారు. కానీ విదేశాల్లో ఉండే పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, లలిత కళలపై శిక్షణ ఇవ్వాలంటే కష్టమే. తల్లిదండ్రులు ఇద్దరూ బిజీగానే ఉంటారు. తాతయ్య, అమ్మమ్మలు అక్కడ ఉండరు. బయటకు వెళ్తే మనకు సంబంధించిన ఏ సంప్రదాయాలు కనిపించవు. మరి మన ఆచార సంప్రదాయాలు ఎలా తెలుస్తాయి?

ఇలాంటి పరిస్థితులు రాకూడదనే అమెరికాలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) పిల్లలకు తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, నృత్యం, నటన, ఇతర లలిత కళలపై శిక్షణ ఇస్తుంటుంది. ఈక్రమంలో డల్లాస్ లో నృత్య, నటన శిక్షణ శిబిరాన్ని నాట్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రోబో గణేషన్ ఈ కార్యక్రమంలో పిల్లలకు శిక్షణ ఇచ్చారు. 20 మంది చిన్నారులు పాల్గొని రోబో డాన్స్, మైమింగ్, నటన, యానిమల్ మూవ్స్, రాంప్ వాక్, డాన్స్ మూవ్స్, వాయిస్ యాక్టింగ్ లాంటి పలు విభాగాల్లో శిక్షణ పొందారు.

రోబో గణేశ్ ను నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అభినందించారు. డల్లాస్ చాప్టర్ కో-కోఆర్డినేటర్ రవి తాండ్ర, ఈవెంట్ కోఆర్డినేటర్ కిశోర్ నారే, నాట్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ రాజేంద్ర మాదాల, జాతీయ  కార్యవర్గ సభ్యులు కవిత దొడ్డ, డీవీ ప్రసాద్, డల్లాస్ కార్యవర్గ సభ్యులు శ్రవణ్ కుమార్ నిదిగంటి, శ్రీనివాస్ ఉరవకొండ, స్వప్న కాట్రగడ్డ, సత్య శ్రీరామనేని సహకరించారు. డల్లాస్ నాట్స్ విభాగ సభ్యులకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ధన్యవాదాలు తెలిపారు.

TAGS