Dana Strom : బంగాళాఖాతంలో ‘దానా’ తుపాను తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం తీవ్ర తుపానుగా మారిన ‘దానా’ గడచిన 6 గంట్టలో గంటకు 12 కి.మీ. వేగంతో కదులుతోంది. పారాదీప్ (ఒడిశా)కి 260 కి.మీ., ధమ్రా (ఒడిశా)కు 290 కి.మీ. సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 350 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది.
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము లోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా-ధమ్రా (ఒడిశా) సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. తీవ్ర తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మేఘావృతమైంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని తీర ప్రాంతం వెంబడి ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ప్రజలు బలమైన ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండి దిగువన ఇచ్చిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.