Daaku Maharaaj Theatrical Trailer : డల్లాస్ లో ఘనంగా డాకు మహరాజ్ ప్రీరిలీజ్ ఈవెంట్.. ట్రైలర్ విడుదల.. చూస్తే గూస్ బాంబ్స్

Daaku Maharaaj Theatrical Trailer  : నందమూరి బాలకృష్ణ ‘ డాకు మహరాజ్’ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్ లో అద్భుతంగా జరిగింది.. ఆరు వేల మందికి పైగా అభిమానుల కేరింతల తో ఆంధ్రా, తెలంగాణ ని మించిన సినిమా అభిమానంతో అమెరికా తెలుగు సినీ పరిశ్రమకి ఈవెంట్ ఆనందాన్ని ఇచ్చింది..

రాబోయే సంక్రాంతికి, నందమూరి బాలకృష్ణ – బాబీ కొల్లి దర్శకత్వంలో డాకు మహారాజ్‌గా కనిపించనున్నాడు. ఈ అగ్రహీరో ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపేందుకు రెడీ అయ్యాడు. మాన్ సింగ్ అనే అపఖ్యాతి పాలైన డకోయిట్ జీవితంపై ఆధారపడిన ఈ చిత్రంతో మరోసారి మాయాజాలాన్ని పునరావృతం చేసేందుకు రెడీ అయ్యారు.

డాకు మహారాజ్ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది, ముఖ్యంగా USAలో అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నాడు.

నందమూరి బాలకృష్ణకు డల్లాస్ ఈవెంట్ లో తెలుగు ప్రజలు నీరాజనం పలికారు. జనవరి 4 (జనవరి 5 IST) న డల్లాస్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్ విడుదల చేశారు. ఉత్సాహభరితమైన అభిమానుల మధ్య థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

TAGS