Daily horoscope in Telugu:డిసెంబర్ 22 శుక్రవారం 12 రాశుల ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయి. ఏ ఏ రాశుల వారికి ఈ రోజు కలిసి వస్తుంది. ఏ ఏ రాశుల వారు జాగ్రత్తలు తీపుకోవాలి. ఏ రాశి వారు వాదోపవాదాలకు దూరంగా ఉండాలి. ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది. వంటి వివరాలు ఈ రోజు రాశి ఫలాల్లో చూద్దాం.
విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు అందుతుంది. బంధు, మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. షణ్ముఖ సుబ్రహ్మణ్యస్వామి దర్శనం మేలు చేస్తుంది.
ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో మీకు డబ్బు అందుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. పరమశివుని ఆరాధన శుభప్రదం.
శుభకాలం. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృతిని కలిగిస్తాయి. శ్రీలక్ష్మీదేవి సందర్శనం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. కీలక సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం. ఇష్టదేవతా దర్శనం ఉత్తమం.
ప్రారంభించే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులతో జాగ్రత్త. ముఖ్యమైనవి కొనుగోలు చేస్తారు. శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం శక్తినిస్తుంది.
మీ మీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాటపడాల్సి వస్తుంది. సహనం కోల్పోవద్దు. నిదానంగా అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. శ్రీలక్ష్మీసహస్రనామ పారాయణం శుభదాయకం.
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద, కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర దర్శనం శుభఫలితాలనిస్తుంది.
భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాయి బాబా సచ్చరిత్ర చదివితే బాగుంటుంది.
ప్రారంభించబోయే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోధైర్యంతో చేసే పనుల వల్ల మంచి పేరు సంపాధిస్తారు. ఇష్టదేవతా స్త్రోత్రం చదివితే బాగుంటుంది.
మీ మీ రంగాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.
దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు.కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుష సమస్యలు తగ్గుతాయి. ఇష్టదేవత ఆరాధన శుభప్రదం.
మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. చంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. గో సేవ మంచి ఫలితాలను ఇస్తుంది.