JAISW News Telugu

Daily horoscope:నేటి రాశి ఫలాలు..12 రాశుల ఫలితాలు ఇలా..

Daily horoscope:డిసెంబర్ 21 గురువారం 12 రాశుల్లో ఏ రాశి ఫ‌లితం ఎలా ఉంది. ఏ రాశి వారికి బాగా క‌లిసి వ‌స్తుంది. ఏ రాశి వారు ఎలాంటి నియ‌మాలు పాటిస్తే మంచిది. ఇష్ట‌దైవారాధ‌న చేస్తే ఎలాంటి ఫ‌లితాలు ఫ‌లితాలు సాధిస్తారు. వంటి వివ‌రాలు ఈ రోజు రాశి ఫ‌లాల్లో చూద్దాం.

కొన్ని విష‌యాల్లో మ‌నోనిబ్బ‌రం అవ‌స‌రం. కొన్ని సంద‌ర్భాల్లో అస్థిర బుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు చేస్తారు. కీల‌క లావాదేవీల విష‌యంలో నిపుణుల‌ను సంప్ర‌దించి చేయ‌డం ఉత్త‌మం. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర స్వామి ద‌ర్శ‌నం మేలు చేస్తుంది.

మీ కృషి ఫ‌లిస్తుంది. అధికారులు మీ ప‌నితీరుకు ప్ర‌శంస‌లు కురిపిస్తారు. తోటివారి స‌హ‌కారంతో అనుకున్న ప‌నులు త్వ‌ర‌గా పూర్తి చేస్తారు. ఎవ‌రితోనూ వాదోప‌వాదాలు చేయ‌కండి. శ్రీ‌ల‌లితాదేవిని స్తుతించాలి.

ఉద్యోగంలో ఉన్న‌త ఫ‌లితాల‌ను అందుకుంటారు. భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో ప‌నులు పూర్తి చేస్తారు. మాన‌సికంగా దృఢంగా ఉంటారు. ధ‌ర్మ‌సిద్ధి ఉంది. సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామిని ఆరాధించాలి.

ప్రారంభించిన ప‌నుల‌లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగ‌మించే ప్ర‌య‌త్నం చేస్తారు. ఒక వ్య‌వ‌హారంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంటారు. కొంద‌రి వ్య‌క్తుల ప్ర‌వ‌ర్త‌న‌, లేదా సంఘ‌ట‌న బాధ క‌లిగిస్తుంది. ఆదిత్య హృద‌యం చ‌ద‌వ‌డం మంచిది.

ప్రారంభించ‌బోయే ప‌నుల్లో దేహ‌జాడ్యాన్ని రానివ్వ‌కండి. విఘ్నాలు ఎదుర‌వుతాయి. చంచ‌లబుద్ధి ఇబ్బంది పెడుతుంది. బంధువుల‌తో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. ఆరోగ్యాన్ని అశ్ర‌ద్ద చేయ‌వ‌ద్దు. శ్రీ‌హ‌రిని ఆరాధిస్తే మంచిది.

గొప్ప సంక‌ల్ప‌బ‌లంతో ముందుకు సాగి అనుకున్న‌ది సాధిస్తారు. మాన‌సికంగా దృఢంగా ఉంటారు. అభివృద్ధి కోసం చేసే ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. అధికారుల స‌హ‌కారం ఉంటుంది. కుటుంబ స‌భ్యుల ఆద‌రాభిమానాలు ఉంటాయి. ఇష్ట‌దైవ ప్రార్థ‌న శుభ‌ప్ర‌దం.

మీ ప‌ట్టుద‌లే మిమ్మ‌ల్ని ముందుకు న‌డిపిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ అవ‌స‌రం. విష్ణ‌/ధ‌్యానంతో మ‌నోబ‌లం పెర‌గ‌డంతో పాటు శుభాలు క‌లుగుతాయి.

మ‌నఃసౌఖ్యం క‌ల‌దు. శుభ‌కార్య‌క్ర‌మాలో పాల్గొంటారు. ఆత్మ‌విశ్వాసంతో చేసే ప‌నుల వ‌ల్ల మంచి జ‌రుగుతుంది. మీ ప‌నితీరుకు ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. అవ‌స‌రానికి స‌హాయం చేసేవారు ఉన్నారు. విష్ణుస‌హ‌స్ర‌నామ పారాయ‌ణం చేయాలి.

మీ మీ రంగాల్లో అనుకూల ఫ‌లితాలు సొంతం అవుతాయి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధు, మిత్రుల‌తో క‌లిసి శుభ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటారు. ఒక వార్త మీ మ‌నోధైర్యాన్ని పెంచుతుంది. క‌న‌క‌ధార‌స్త‌వం చ‌ద‌వాలి.

మాన‌సిక సౌఖ్యం క‌ల‌దు. కొన్ని కీల‌క వ్య‌వ‌హారాల‌లో కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ల‌భిస్తుంది. బంధు, మిత్రుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. ముఖ్య‌వ్య‌వ‌హారాల్లో నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్దు. గోసేవ చేయాలి.

ముఖ్య‌విష‌యాల్లో ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. కీల‌క విష‌యాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు జ‌రిగే అవ‌స‌రం ఉంది. వైరాగ్యాన్ని ద‌రిచేర‌నీయ‌కండి. శివ‌నామాన్ని జ‌పించ‌డం ఉత్త‌మం.

గ్ర‌హ‌బ‌లం అనుకూలిస్తోంది. అభివృద్ధికోసం చేసే ప్ర‌తి ప్ర‌య‌త్న‌మూ ఫ‌లిస్తుంది. నూత‌న వ‌స్తువుల‌ను కొనుగోలు చేస్తారు. అధికారుల స‌హ‌కారం ఉంది. కుటుంబ స‌భ్యుల ఆద‌రాభిమానాలు ఉంటాయి. ఇష్ట‌దైవ ప్రార్థ‌న శుభ‌ప్ర‌దం.

Exit mobile version