JAISW News Telugu

Daily horoscope:నేటి రాశి ఫలాలు..12 రాశుల ఫలితాలు ఇలా..

Daily horoscope:డిసెంబర్ 20 బుధ‌వారం 12 రాశుల ఫలితాలు ఇలా ఉన్నాయి. ఈ ప‌న్నెండు రాశుల్లో ఏ రాశి వారు జాగ్ర‌త్త‌లు పాటించాలి. ఏ రాశి వారికి ఈ రోజు బాగా క‌లిసి వ‌స్తుంది. ఇబ్బందులు తొల‌గాలంటే ఏ రాశి వారు ఎవ‌రిని పూజిస్తే మంచిది.. ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మంచి జ‌రుగుతుంది. అనుకున్న ప‌నులు అనుకున్న విధంగా పూర్త‌వుతాయి..వంటి విష‌యాల‌ని ఈ రోజు రాశి ఫ‌లాల్లో చూద్దాం.

ప్రారంభించ‌బోయే ప‌నుల్లో ప్ర‌య‌త్న‌బ‌లాన్ని పెంచాలి. రెట్టించిన ఉత్సాహంతో ప‌నిచేస్తే ల‌క్ష్యం నెర‌వేరుతుంది. ఎవ‌రినీ అతిగా న‌మ్మ‌వ‌ద్దు. ఆర్థికప‌రంగా ఇబ్బందులు త‌లెత్త‌కుండా ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించాలి. శ్రీ‌రామ నామాన్ని జ‌పించాలి.

అద్భుత‌మైన కాలం న‌డుస్తోంది. ఏ ప‌నిని ప్రారంభించినా విజ‌యం వ‌రిస్తుంది. శ‌త్రువులు మిత్రువులు అవుతారు. ఆర్థికంగా బ‌ల‌ప‌డ‌తారు. శుభ‌కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల‌తో ఉల్లాసంగా గ‌డుపుతారు. ప్ర‌యాణాలు నెర‌వేరుతాయి. శ్రీఆంజ‌నేయ‌స్వామి ద‌ర్శ‌నం మేలు చేస్తుంది.

తోటివారి స‌హ‌కారంతో ప‌నులు పూర్తి చేస్తారు. అస్తిర‌బుద్ధి వ‌ల్ల ఇబ్బందులు ఎదుర‌వుతాయి. కుటుంబ వ్య‌క్తుల‌ను ప్రేమ భావంతో చూడ‌టం ద్వారా చ‌క్క‌టి ఫ‌లితాలు వ‌స్తాయి. ఆదిత్య హృద‌యం చ‌దివితే మంచిది.

ప్రారంభించిన ప‌నుల‌లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మ‌నోధైర్యంతో పూర్తి చేస్తారు. అవ‌స‌రానికి త‌గిన స‌హాయం అందుతుంది. స‌మాజంలో గౌర‌వం త‌గ్గ‌కుండా చూసుకోవాలి. ఆర్థిక‌ప‌రంగా జాగ్ర‌త్త అవ‌స‌రం. శ్రీ‌ల‌క్ష్మీస్తుతి చేయ‌డం మంచిది.

ఆత్మవిశ్వాసంతో ప‌నులు పూర్తి చేస్తారు. ప్రారంభించ‌బోయే ప‌నుల్లో అవ‌గాహ‌నాలోపం లేకుండా జాగ్ర‌త్త ప‌డాలి. ముఖ్య‌విష‌యాల‌లో అనుభ‌వజ్ఞుల స‌ల‌హాలు తీసుకోవ‌డం మంచిది. ఆరోగ్యం విష‌యంలో శ్ర‌ద్ధ అవ‌స‌రం. ప్ర‌యాణాలు క‌లిసి వ‌స్తాయి. శ్రీ‌విష్ణుమూర్తిని ధ్యానించ‌డం మంచిది.

మీదైన రంగంలో శుభ‌ఫ‌లితాలు ఉన్నాయి. స్వ‌ల్ప ప్ర‌నయ‌త్నంలోనే విజ‌యం వ‌రిస్తుంది. ఆర్థిక‌ప‌ర‌మైన అభివృద్ధిని సాధిస్తారు. విందు, వినోద కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటారు. బంధుప్రీతి ఉంది. శివారాధ‌న‌తో మ‌రిన్ని విజ‌యాలు సొంతం అవుతాయి.

శుభకాలం న‌డుస్తోంది. ఆలోచ‌న‌లు విక‌సిస్తాయి. ప్రారంభించ‌బోయే ప‌నుల్లో ఆటంకాలు తొల‌గుతాయి. మీ ప్ర‌తిభ‌తో అంద‌రిని ఆక‌ట్టుకుంటారు. ఆదాయం పెరిగే సూచ‌న ఉంది. ఆరోగ్యం ఫ‌ర‌వాలేదు అనిపిస్తుంది. కుటుంబ స‌భ్యుల స‌హాయం అందుతుంది. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామిని ద‌ర్శించండి.

వ్యాపారంలో శ్ర‌ద్ధ‌గా ప‌నిచేయ‌డం ద్వారా లాభాలు వ‌స్తాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మ‌రోధైర్యంతో ఎదుర్కొంటారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు జ‌రిగే అవ‌కాశం ఉంది. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త‌. అప్పులు ఇబ్బంది పెడ‌తాయి. రుణ విమోచ‌క అంగార‌క స్త్రోత్రం చ‌దివితే మేలు జ‌రుగుతుంది.

ప్ర‌తి విష‌యంలోనూ ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. అనుకున్న‌ది సాధించే వ‌ర‌కు పోరాటం ఆపకండి. తోటివారి స‌హ‌కారంతో ఒక ప‌ని పూర్త‌వుతుంది. శుభ‌కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటారు. ఖ‌ర్చులు అదుపు త‌ప్ప‌కుండా చూసుకోవాలి. హ‌నుమాన్ చాలీసా చ‌ద‌వ‌డం మంచిది.

స్వ‌ల్ప ప్ర‌య‌త్నంతో గొప్ప కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేస్తారు. పెద్ద‌లు చెప్పిన సూచ‌న‌ల‌తో ప‌నులు త్వ‌ర‌గా పూర్త‌వుతాయి. కుటుంబ అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఫ‌లిస్తుంది. ఆరోగ్యం విష‌యంలో శ్ర‌ద్ధ అవ‌స‌రం. శివారాధ‌న శుభాల‌ను క‌లిగిస్తుంది.

సంపూర్ణ మ‌నోబ‌లంతో విజ‌యాలు సాధిస్తారు. చాప‌కింద నీరులా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. క‌ల‌హాల‌తో కాలాన్ని వృథా చేయ‌కండి. ఆరోగ్యం ప‌రంగా ఒత్తిడి పెర‌గ‌కుండా చూసుకోవాలి. ఆత్మీయుల స‌ల‌హాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. గ‌ణ‌ప‌తిని ధ్యానించండి.

మీ మీ రంగాలలో ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించాలి. ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల‌తో శ్ర‌మ త‌గ్గుతుంది. వ్యాపార ప‌రంగా ఆచితూచి నిర్ణ‌యాలు తీసుకుంటే మంచిది. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తే స‌త్ఫ‌లితాలు వ‌స్తాయి. ఆదిత్య హృద‌య పారాయ‌ణం మేలు చేస్తుంది.

Exit mobile version