Today horoscope:డిసెంబ‌ర్ 16 శ‌నివారం..12 రాశుల ఫలితాలు ఇలా..

Today horoscope:డిసెంబ‌ర్ 16 శ‌నివారం ఈ రోజు ప‌న్నెండు రాశుల ఫ‌లితాలు ఎలా ఉన్నాయి. ఎవ‌రెవ‌రి రాశుల‌కు శుభం క‌లుగుతుంది. ఏఏ రాశులు జాగ్ర‌త్త‌లు పాటించాలి. ఎలాంటి నిబంధ‌న‌లు పాటించాలి. ఎవ‌రిని ఆరాధిస్తే ఆప‌ద‌లనుంచి గ‌ట్టెక్కుతారు వంటి వివ‌రాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం.

శుభ స‌మ‌యం మాన‌సికంగా దృఢంగా ఉంటారు. శుభకార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు. అధికారుల స‌హాయస‌హ‌కారాలు అందుతాయి. దుర్గాదేవి ద‌ర్శ‌నం శుభ‌ప్ర‌దం.

ప్రారంభించ‌బోయే ప‌నుల్లో కాలానుగుణంగా ముందుకుసాగండి. మంచి జ‌రుగుతుంది. నూత‌న వ‌స్తువుల‌ను సేక‌రిస్తారు. అన‌వ‌స‌ర ఖ‌ర్చుల‌ను అదుపులో ఉంచండి. హ‌నుమ‌త్ ఆరాధ‌న శుభ‌ప్ర‌దం.

తోటివారి సూచ‌న‌ల‌ను పాటించ‌డం ఉత్త‌మం. మీ మీ రంగాల్లో మీ ప‌రిధిని మించిన విష‌యాల్లో త‌ల‌దూర్చ‌కండి. వ్యాపారంలో మీరు చేసే ఆలోచ‌న‌ల్ని ఎదుటివారితో పంచుకోవ‌డం ద్వారా సాధ్యాసాధ్యాల‌ను అంచ‌నా వేయ‌వ‌చ్చు. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర‌స్వామి సంద‌ర్శ‌నం శుభ‌ప్ర‌దం.

మీ మీ రంగాల్లో శుభ ఫ‌లితాలు ఉన్నాయి. ముఖ్య‌మైన విష‌యాల్లో సొంత నిర్ణ‌యాలు ప‌ని చేస్తాయి. సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాలు విజ‌యాన్ని అందిస్తాయి. శ్రీ‌విష్ణు సంద‌ర్శ‌నం శుభ‌ప్ర‌దం.

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల‌త క‌ల‌దు. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి. కీల‌క వ్య‌వ‌హారాల్లో వెన‌క‌డుగు వేయ‌కండి. ప్ర‌ణాళికల‌కు అనుగుణంగా ముందుకు సాగండి. స్థిర నిర్ణ‌యాలు విజ‌యాన్ని చేకూరుస్తాయి. గోవింద నామాలు చ‌ద‌వ‌డం మంచిది.

ఉత్సాహంగా ప‌నిచేయాలి. బంధువుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ప్ర‌తి విష‌యాన్ని కుటుంబంతో చ‌ర్చించి ప్రారంభించాలి. శ్రీ‌ల‌క్ష్మీ స‌హ‌స్ర‌నామం చ‌దివితే మంచి జ‌రుగుతుంది.

ధ‌ర్మ‌చింత‌న‌తో వ్య‌వ‌హ‌రిస్తారు. ఆరోగ్యం స‌హ‌క‌రిస్తుంది. గొప్ప‌వారితో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. న‌లుగురికి ఆద‌ర్శంగా నిలుస్తారు. దైవ‌బ‌లం సంపూర్ణంగా ర‌క్షిస్తోంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్ర‌ద్ధ చేయ‌కండి. సూర్య‌నారాయ‌ణ మూర్తి ఆరాధ‌న శుభ‌దాయ‌కం.

క‌ర్మ‌సిద్ధి ఉంది. తోటివారి స‌హ‌కారంతో అనుకున్న ఫ‌లితాలు నెర‌వేరుతాయి. అన‌వ‌స‌ర విష‌యాల గురించి స‌మ‌యాన్ని వృధా చేయ‌కండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. శ్రీ‌రామ నామాన్ని జ‌పించ‌డం ఉత్త‌మం.

వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల‌లో మిశ్ర‌మ వాతావ‌ర‌ణం ఉంటుంది. ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ మ‌నోధైర్యాన్ని కోల్పోకండి. తోటివారి స‌హ‌కారంతో మేలు జ‌రుగుతుంది. దైవారాధ‌న మాన‌వ‌ద్దు.

అనుకూల స‌మ‌యం. తోటివారి స‌హ‌కారాలు అందుతాయి. మీ బుద్ధిబ‌లంతో కీల‌క స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించి అంద‌రి మ‌న్న‌న‌ల‌ను పొందుతారు. ప్ర‌యాణాలు ఫ‌లిస్తాయి. గ‌ణ‌ప‌తి ఆరాధ‌న శ్రేష్టం.

కీల‌క వ్య‌వ‌హారాల్లో స‌మాచార‌లోపం లేకుండా చూసుకోవాలి. వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల‌లో శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం ల‌భిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మ‌నోబ‌లంతో ముందుకు సాగండి. అనుకూల ఫ‌లితాలు వ‌స్తాయి. శ్ర‌మ పెరుగుతుంది. ఎవ‌రితోనూ వాదోప‌వాదాలు చేయ‌వ‌ద్దు. ఇష్ట‌దైవ ప్రార్థ‌న చేస్తే మంచిది.

ప్రారంభించ‌బోయే ప‌నుల్లో గొప్ప ఫ‌లితాలు సాధిస్తారు. మ‌నఃసంతోషాన్ని పొందుతారు. శుభ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల‌తో ఆనందంగా గ‌డుపుతారు. విష్ణు స‌హ‌స్ర నామాలు చ‌దివితే మంచి జ‌రుగుతుంది.

TAGS