JAISW News Telugu

Daggubati Purandeshwari : వైసీపి ప్రభుత్వం పై ధ్వజమెత్తిన దగ్గుబాటి పురంధేశ్వరి 

Daggubati Purandeshwari

Daggubati Purandeshwari

Daggubati Purandeshwari : నాలుగున్నర సంవత్సరాలుగా   రాష్ట్ర ప్రభుత్వం  రైతులు వంక కన్నెత్తి కూడా చూడలేదని  బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబా టి పురంధేశ్వరి వైసీపి ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. విజయవాడ లో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు గర్జన సభ నిర్వహించారు. ఎపిలో రైతుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉందనీ  90 శాతానికి పైగా రైతులు అప్పుల్లో కూరుకు పోయారనీ  పురందే శ్వరి ఆరోపించారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానంలో ఎపి ఉందనీ రైతు పక్ష పాతి ప్రభుత్వం అనేది జగన్ మాటలకే పరిమితం చేతల్లో సున్నా అంటూ ఆక్షేపించారు.

రైతులను ఆదుకోవడం లో పూర్తిగా విఫలం అయ్యారనీ వ్యవసాయం,  ఆక్వా, పాడి పరిశ్రమ లో ఉత్పాదన తగ్గిపోయిందన్నారు.ఏ విధంగా మీది రైతు ప్రభుత్వం అవుతుందో చెప్పాలన్నారు.బైబిల్, ఖురాన్, భగవద్గీత.. మా మ్యానిఫెస్టో అని గొప్పగా చెప్పారు.ఆ హామీలు అమలు చేయకుం డా ఆ పవిత్ర గ్రంధాలని అవమానించారు .మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ కోసం అన్నారనీ నాలుగు వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాలు కోసం నిధి అని గొప్పలు చెప్పారని మండిపడ్డారు. మరి ఈ నిధి లు ఎక్కడకు వెళ్లాయో జగన్ సమాధానం చెప్పాలనీ తుఫాన్ లతో నష్టపోయిన రైతులను ఆదుకోలేదన్నారు.

పంట పరిశీలన కు వచ్చి  ఫ్యాంట్లు పాడైపోతా యని పొలాల్లోకి కూడా దిగలేదనీ ఆమె ఆరోపిం చారు. అధికారంలో లేనప్పుడు రెండేళ్ల పాటు ఓదార్పు యాత్ర చేశారనీ మరి ఇప్పుడు అదే రైతుల ఇళ్లకు ఎందుకు వెళ్లడం లేదనీ ఆమె ప్రశ్నించారు. మద్దతు ధర కోరితే  కనీసం స్పందన లేదనీ అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకు పోయి నష్టపోయిన వారిని ఆదుకో లేదనీ ఆమె. విమర్శించారు.

మరో అతిధి బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్  మాట్లాడుతూ బిజెపి రైతు గర్జన చూసి ప్రభుత్వం భయ పడుతుందన్నారు.మా సభకు రాకుండా వివిధ ప్రాంతాల్లో రైతుల ను అడ్డుకో వడం దుర్మార్గం.. న్యాయం కోసం పోరాటం చేస్తు న్న ఎబివిపి నేతలను కూడా అరెస్టు చేయడం ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదన్నారు. నేడు జగన్ ప్రభుత్వం అన్ని వర్గాలను వంచిస్తూ నయ వంచనకు పాల్పడ్డారన్నారు.

Exit mobile version