JAISW News Telugu

Cylinders : వీరికి మాత్రమే దీపం పథకంలో సిలిండర్లు.. వారెవరంటే?

Cylinders

Cylinders

Cylinders : ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 31 నుంచి దీపం పథకం ప్రారంభించాలని అనుకుంటున్నారు. బుధవారం (అక్టోబర్ 23) రోజున జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏడాదికి మూడు సిలిండర్ల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేబినెట్ సమావేశం అనంతరం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకరులతో మాట్లాడారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ వాగ్ధానాల్లో భాగమైన దీపం పథకంతో రూ. 2,684 కోట్లు అదనపు భారం పడుతుందన్నారు.

‘ఉచిత సిలిండర్ సరఫరా కోసం ‘దీపం’ పథకానికి బుకింగ్ దీపావళి పండుగకు మూడు రోజుల ముందు ప్రారంభమవుతుంది, దీని ద్వారా పండుగ రోజున సిలిండర్ల పంపిణీ ఉంటుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ అనే మూడు గ్యాస్ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.

ఒక్కో ఎల్‌పిజి సిలిండర్ ధర ₹ 894.92 అవుతుందని , డెలివరీ అయిన 48 గంటల్లోగా అర్హత ఉన్న కుటుంబాలు ఈ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా వారి ఖాతాలోకి రీయింబర్స్‌మెంట్ పొందుతాయని తెలిపారు.

‘దీపం పథకం మూడు దశల్లో అమలు చేయబడుతుంది, నాలుగు నెలలకు ఒకసారి – ఏప్రిల్ నుంచి జూలై, ఆగస్ట్ నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి వరకు’ ఈ పథకం అమల్లో వినియోగదారులకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే.. వాటిని గ్రామ, వార్డు సచివాలయాల్లోని డెస్క్‌ల వద్ద వెంటనే పరిష్కరిస్తామని మనోహర్ చెప్పారు.

 ఈ అర్హతలు ఉండాలి..
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు మాత్రమే అందిస్తారు. అయితే సిలిండర్ కు లబ్ధిదారులు ముందుగా డబ్బు చెల్లిస్తే రెండు రోజుల్లో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీని జమ చేస్తారు. ఈ దీపం పథకంలో ప్రయోజనం పొందాలంటే ఏపీ పౌరుడై ఉండాలి, తెలుపు రేషన్ కార్డు ఉండాలి. గ్యాస్ కనెక్షన్ ఉండాలి. బిలో పావర్టీ లైన్ దిగువ ఉన్న కుటుంబాలకు మాత్రమే అందజేస్తారు.

ఆధార్ కార్డు, వైట్ రేషన్ కాదు, మొబైల్ నెంబర్, కరెంట్ బిల్లు, స్థానికుడినని ధ్రువీకరణ పత్రం ఉంటేనే దీపం పథకానికి అర్హత సాధిస్తారని చెప్పారు.

Exit mobile version