Cyclone : తీరం దాటిన వాయుగుండం.. ఒడిశాలో భారీ వర్షాలు

Cyclone

Cyclone

Cyclone : భారత వాతావరణ శాఖ అంచనాలకు  ఒడిశాలోని పూరీ దగ్గర తీవ్ర వాయుగుండం తీరం దాటింది. సోమవారం ఉదయం 11.30 గంటలకు పూరీ సమీపంలోని గోపాల్ పుర్ వద్ద తీరం దాటినట్లు వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం మరో 24 గంటల వరకు ఉంటుందని వెల్లడించారు. వాయుగుండం ప్రభావంతో ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మాల్కాన్ గిరిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, మన్యం పార్వతీపురి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరితో పాటు ఉమ్మడి కృష్ణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని తుపాన్ హెచ్చరికల కేంద్ర సూచిస్తోంది.

TAGS