Cyber ​​criminals : బామ్మను మోసగించిన సైబర్ కేటుగాళ్లు.. రూ.22 లక్షలు స్వాహా

Cyber ​​criminals

Cyber ​​criminals

Cyber ​​criminals : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పేరిట సిటీకి చెందిన రిటైర్డ్ మహిళా ఉద్యోగ(80)ని సైబర్ చీటర్స్ మోసగించారు. కొద్ది రోజుల కిందట ఆమె మొబైల్ నంబర్ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పేరిట సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించారు. కేసు ఫైల్ చేయొద్దంటే ఆమె అకౌంట్ లోని నగదు ట్రాన్స్ ఫర్ చేయాలని, ఆర్బీఐ రూల్స్ మేరకు వెరీఫై చేసి, తిరిగి పంపిస్తామంటూ నమ్మించారు.

దీంతో బాధితురాలు తన అకౌంట్ లోని రూ.22 లక్షలు సైబర్ నేరగాళ్లు చెప్పిన అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేసింది. అనంతరం ఆమె తన కొడుకుకు విషయం చెప్పగా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.

TAGS