MLA Raghurama : ప్రస్తుతం తిరుమల ప్రసాదాలు బాగున్నాయి: ఎమ్మెల్యే రఘురామ

MLA Raghurama
MLA Raghurama : ప్రస్తుతం తిరుమల ప్రసాదాలు ఎంతో బాగున్నాయని, గత ప్రభుత్వంలో భగవంతుడిని భక్తుడికి దూరం చేసే కార్యక్రమం కొంత జరిగిందని, ప్రస్తుతం టీటీడీ అధికారులు మళ్లీ దగ్గర చేస్తున్నారని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అన్నారు. ఆదివారం ఉదయం వీఐపీ వెలుపల రఘురామ మాట్లాడుతూ, స్వామివారి ప్రసాదాలు బాగున్నాయని, ఐదు సంవత్సరాల కిందట దిట్టం ప్రకారం ఎలా నివేదించేవారూ ఇప్పుడు అదే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు.