Chicago Andhra Association : చికాగో ఆంధ్రా అసోసియేషన్ (CAA) 2016లో స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మద్దతివ్వడం, చికాగో ప్రాంతంలో సంస్కృతిని చాటడం సీఏఏ ముఖ్య ఉద్దేశ్యం. ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల దసరా, దీపావళి వేడుకలను నిర్వహించారు. నవంబర్ 4వ తేదీన వేడుకలు ఓస్వగో ఈస్ట్ హై స్కూల్ ఆడిటోరియంలో వైభవంగా కొనసాగాయి.
అసోసియేషన్ చైర్మన్ సుజాత అప్పలనేని, అధ్యక్షుడు గౌరీ శంకర్ అద్దంకి ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షురాలు శ్వేతా కొత్తపల్లి సహకారంతో కొనసాగిన ఈ సంబురాలకు 800 మందికి పైగా పాల్గొన్నారు. నునురాధ గంపాల, ప్రభాకర్ మల్లంపల్లి ఆధ్వర్యంలో హేమంత్ తలపనేని, శ్రీకృష్ణ మతుకుమల్లి, మురళి రెడ్డివారి, నరసింహారావు వీరపనేని సభ్యత్వ నమోదు, రెజిస్ట్రేషన్ నిర్వహించారు. త్వరలో CAA ఆప్ ను కూడా రిలీజ్ చేస్తామని కమిటీ ప్రకటించింది. అధ్యక్షుడితో పాటు కోశాధికారి (ట్రెజరర్) ప్రభాకర్ మల్లంపల్లి వార్షిక మీటింగ్ నిర్వహించారు.
జ్యోతి ప్రజ్వలన, ప్రార్థనా గీతంతో ప్రారంభమైన వేడుకలు సంస్కృతిక కార్యక్రమాలతో పాటు వెస్టర్న్ డ్యాన్స్ పోటీలతో ఆద్యంతం కన్నుల పండువగా సాగింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఇందులో పాల్గొని ఆనందంగా గడిపారు. ఆ తర్వాత స్పాన్సర్లు, దాతలను ఎగ్జిక్యూటివ్ కమిటీ సన్మానించింది. రాధికా గరిమెళ్ల సమక్షంలో చికాగోలోని 35కు పైగా ఆంధ్ర సంఘాలు దివంగత పాటల రచయిత ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి’కి నివాళులర్పించాయి. ఈ కార్యక్రమంలో ఆయన రాసిన పాటలను సింగర్లు పాడి అలరించారు.
సాంస్కృతిక కార్యక్రమాలను కల్చరల్ టీం అనూష బెస్త, సౌజన్య రాళ్లబండి, హరిణి మేడ సమన్వయంతో నిర్వహించగా శ్రీనివాస పద్యాల, శైలజ సప్ప, శిల్పా రామిశెట్టి సహకారం అందించారు. ‘2023 ధమకా’ డాన్స్ తో సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టెర్లు, అధ్యక్షులు, వ్వస్థాపకు వీక్షకులను అలరించారు. అనంతరం సురేష్ కుమార్ ఐనపుడి ఆధ్వర్యంలో ‘గోల్కొండ రెస్టారెంట్’ ఏర్పాటు చేసిన ఆంధ్రా భోజనం కడుపునింపింది.
వేడుకల చివరలో అధ్యక్షుడు గౌరీ శంకర్ అద్దంకి కృతజ్ఞతలు తెలియజేయగా.. రామరావు కొత్తమాసు వందన సమర్పించారు. అమెరికా, భారత జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం సుసంపన్నమయింది.