CSK VS LSG : లక్నో సూపర్ విక్టరీ

CSK VS LSG

CSK VS LSG

CSK VS LSG : లక్నో చెన్నై మధ్య చేపక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ ఉత్కంఠ భరితంగా ముగిసింది.  లక్నో బ్యాటర్
స్టోయినిస్ సెంచరీ తో చెలరేగడంతో 3 బంతులు మిగిలి ఉండగానే లక్నో సూపర్ విజయం సాధించింది. చెన్నై మొదట బ్యాటింగ్ చేసి 210 పరుగుల భారీ స్కోరు చేసింది.  చెన్నై స్కిప్పర్ రుతురాజు గైక్వాడ్ 108 పరుగులతో రాణించాడు. 12 ఫోర్లు మూడు సిక్సర్లతో మొత్తం 108 పరుగులు చేసి చెన్నై జట్టుకు మంచి స్కోరు అందించాడు. శివం దూబే కూడా 27 బంతుల్లోనే 66 పరుగులు చేసి ఏడు సిక్సర్లతో బెంబేలెత్తించాడు. దీంతో చెన్నై 210 పరుగులతో ఇన్నింగ్స్ ముగించింది.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన లక్నో బ్యాటర్లలో డికాక్  సున్న పరుగుల కే అవుట్ కాగా రాహుల్ రాణించలేకపోయాడు.  కానీ మార్కస్ తన అద్భుత ఆటతీరుతో 63 బంతుల్లోనే 124 పరుగులు చేసి లక్నోకు చేపాక్ స్టేడియంలో విజయాన్ని సొంతం చేశాడు. ముఖ్యంగా 13 బౌండరీలు ఆరు సిక్సర్లతో చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చెన్నై బౌలర్ల పై మార్క్ స్టోయినిసు అండ్ నికోలాస్ పురన్ ఇద్దరు కలిసి ఎదురు దాడి చేశారు.

నికోలస్ పురన్ 15 బంతుల్లోనే 34 పరుగులు చేసి స్టోయినిస్ కు అండగా నిలిచాడు. చివర్లో దీపక్ హుడా కూడా ఆరు బంతుల్లో 17 పరుగులు చేసి లక్నో విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్లో లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చేపక్ స్టేడియంలో ఈ సీజన్లో జరిగిన మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు మొదటి పరాజయం ఇది. గత మూడు మ్యాచ్లు ఇక్కడ జరగగా మూడింటిలోనూ చెన్నై అలవోకగా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొత్తం 200 పరుగులు పైగా చేసి ఓడిపోవడం బాధ కలిగించే విషయం. ఈ విజయంతో చెన్నై ఐదో స్థానానికి పడిపోగా లక్నో నాలుగో స్థానానికి చేరుకుంది పాయింట్లు పట్టికలో లక్నో నాలుగో స్థానానికి చేరడంతో దాన్ని కొనసాగించాలని కోరుకుంటుంది.

TAGS