CS Neerabh Kumar : సీఎస్ నీరభ్ కుమార్ పదవీకాలాన్ని పొడిగించాలని.. కేంద్రానికి సీఎం లేఖ

CS Neerabh Kumar Prasad
CS Neerabh Kumar : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి బుధవారం లేఖ రాశారు. ఇటీవల సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నీరబ్ పదవీకాలం ఈనెల 30తో ముగియనుంది.
ఈ నేపథ్యంలో ఆయన సర్వీసును మరో 6 నెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
గత ప్రభుత్వంలో నీరభ్ కుమార్ సీఎస్ కావలసి ఉండగా, జగన్ ప్రభుత్వం ఆయనను పక్కన పెట్టి జూనియర్ అయిన జవహర్ రెడ్డికి సీఎస్ గా బాధ్యతలు కట్టబెట్టింది. కాగా, కేంద్రం ఒకే విడతలో నీరభ్ కుమార్ కు 6 నెలలు పొడిగింపు ఇస్తుందా.. లేదా 3 నెలల చొప్పున రెండుసార్లు పొడిగిస్తుందా చూడాలి.