CS Jawahar Reddy : సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి అవుట్.. పని మొదలు పెట్టిన బాబు..

CS Jawahar Reddy

CS Jawahar Reddy

CS Jawahar Reddy : కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారుల స్థానంలో చలనం కలుగుతుంది ఇది సాధారణంగా జరిగే ప్రక్రియనే. కానీ కొందరు అధికారుల తీరుతో విసుగు చెందిన పార్టీలు తమ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే వారికి కొరఢా ఝులిపిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇదే కనిపిస్తుంది. వైసీపీ హయాంలో కొంత మంది అధికారులు పార్టీ కార్యకర్తల్లా మారి ప్రతిపక్షమైన టీడీపీ విషయంలో రాక్షసంగా ప్రవర్తించారు. దీన్ని గత ఐదేళ్లుగా వారి తీరును గమనించిన చంద్రబాబు నాయుడు వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు.

వైసీపీ కార్యక‌ర్తల్లా వ్యవహరించిన అధికారుల‌పై కొత్త ప్రభుత్వం కొర‌డా ఝులిపిస్తుంది. ఎన్నిక‌ల సమ‌యంలో అధికార పార్టీకి కొమ్ము కాస్తూ, కూటమి నేతలపై ఉక్కుపాదం మోపిన అధికారుల‌ను ఒక్కొక్కరిగా త‌ప్పిస్తోంది. ఇప్పటికే సీఎంవోను బాబు కంట్రోల్ లోకి తీసుకున్నారు. దీంతో సీఎస్ మార్చేస్తార‌ని అందరూ ఊహిస్తున్నారు. ప్రస్తుత సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి సెల‌వులో ఉన్నారు. జూన్ 6వ తేదీన ఆయన రిటైర్ కాబోతున్నారు. అప్పటి వరకు ఆయన సెలవులోనే ఉండేలా కనిపిస్తోంది. అయితే, కొత్త ప్రభుత్వం తనపై వేటు వేస్తుందనే ఆయన సెలవుపై వెళ్లారని స‌చివాల‌య వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది.

ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు కొత్త ప్రభుత్వం నుంచి స‌ల‌హ‌దారుల‌ను త‌ప్పించ‌బోతున్నారట. స్వతహాగా రాజీనామా చేస్తే ఓకే, లేదంటే ప్రభుత్వం నుంచి ఆదేశాలు రానున్నాయట. ఆర్థిక‌ శాఖ స్పెష‌ల్ సీఎస్ రావ‌త్ కూడా సెల‌వుపై వెళ్లగా.. సీఐడీ చీఫ్ సంజ‌య్ కూడా సెల‌వుపై వెళ్లేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కానీ, కొన్ని విమర్శలు రావడంతో ఆయ‌న సెలవును ర‌ద్దు చేసుకున్నారు.

గత ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స ఎన్నికల ముందు నిబంధనలకు వ్యతిరేకంగా టీచ‌ర్ల బ‌దిలీలు చేశారు. బొత్స ఒత్తిడితోనే బదిలీలు జరిగాయన్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ఈ బ‌దిలీల‌ను కొత్త ప్రభుత్వం హోల్డ్ చేసింది. ఈ మేర‌కు ఏపీ పాఠ‌శాల విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.

TAGS