SRH Vs GT : ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య గురువారం సాయంత్రం కీలక పోరు జరగనుంది. సన్ రైజర్స్ ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆప్స్ కు నేరుగా వెళుతుంది. ఇంకో మ్యాచ్ కూడా ఆడాల్సి ఉన్న సన్ రైజర్స్ కు ఆ మ్యాచ్ కూడా గెలిస్తే టాప్ 2 లో స్థానం ఖాయమవుతుంది. రెండు మ్యాచులు ఉప్పల్ లోనే జరుగనుండటంతో సన్ రైజర్స్ కు కలిసొచ్చే అంశం.
సన్ రైజర్స్ బ్యాటర్లు భీకర పామ్ లో ఉన్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ వర్మ ఇద్దరు మళ్లీ పామ్ లోకి వచ్చారు. గత మ్యాచ్ లో కేవలం 9.4 ఓవర్లలోనే 162 పరుగులు చేసి లక్నో టీంపై విరుచుకుపడ్డారు. వీరి చేసిన విధ్వంసానికి లక్నో కోలుకోలేకపోయింది. బౌలింగ్ లో భువీ పామ్ లోకి వచ్చాడు. ఫ్యాట్ కమిన్స్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నాడు. నటరాజన్ మరిన్నియార్కర్స్ వేయాలని ప్రాక్టీస్ చేస్తున్నాడు. నితీశ్ రెడ్డి, క్లాసెన్ మిడిలార్డర్ లో అదరగొడుతున్నారు. దీంతో ఈ మ్యాచ్ గెలిచి కప్ రేసులో ముందంజలో ఉండాలని కోరుకుంటోంది.
గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఇంటి దారి పట్టింది. కేవలం పరువు కాపాడుకోవడానికే ఈ మ్యాచ్ లో గెలవాలని చూస్తుంది. గుజరాత్ కోల్ కతా మ్యాచ్ వర్షార్పణం కాగా.. అంతకుముందు మ్యాచ్ లో గిల్, సాయి సుదర్శన్ సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ ఇప్పుడూ ఫామ్ లోకి రావడం కలిసొచ్చే అంశం. గుజరాత్ గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన తో టైటిట్ విన్నర్, రన్నరప్ గా నిలిచింది.
కానీ హర్దిక్ పాండ్యా కెప్టెన్సీ వదులు కుని ముంబయి కి కెప్టెన్ గా వెళ్లడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది.
సన్ రైజర్స్ గెలిస్తే 16 పాయింట్లతో మూడో స్థానానికి వెళుతుంది. నెట్ రన్ రేట్ కూడా మెరుగవుతుంది. కాబట్టి సన్ రైజర్స్ కు కీలక మ్యాచ్ గా మారనుంది.