JAISW News Telugu

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

Tirumala

Tirumala

Tirumala : తిరుమలకు భక్తులు పోటెత్తారు. దీపావళి పండుగతో పాటు వారాంతపు సెలవులు కలిసి రావడంతో స్వామివారిని దర్శించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. నిన్న సాయంత్రం నుంచి తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. దీంతో ఎలాంటి టికెట్లు, టోకెన్లు లేని సామాన్య భక్తులకు దేవదేవుడిని దర్శించుకునేందుకు 20 నుంచి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు అన్ని పూర్తిగా నిండి, రింగ్ రోడ్ మీదుగా శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. వెలుపల క్యూలైన్లతో పాటు కంపార్ట్ మెంట్లలోని షెడ్డుల్లో ఉన్న భక్తులకు నిర్విరామంగా అన్న పానీయాలను శ్రీవారి సేవకులు సరఫరా చేస్తున్నారు. మరోవైపు రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది వాహన రాకపోకలను, వాహనాల పార్కింగ్ ను పర్యవేక్షిస్తున్నారు.

Exit mobile version