Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నారాయణగిరి షెడ్ల వరకు అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కాగా, జూన్ 29వ తేదీ శనివారం రోజున శ్రీవారిని 80,404 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 35,825 మంది తలనీలాలు సమర్పించగా హుండీ ఆదాయం రూ.3.83 కోట్లు సమకూరిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు తిరుమలకు వచ్చే భక్తులకు మరింత నాణ్యమైన, రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించడమే టీటీడీ లక్ష్యమని ఈవో జె.శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని పెద్ద, జనతా హోటళ్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన తెలిపారు.