JAISW News Telugu

Cross Voting : కూటమికి క్రాస్ ఓటింగ్ చాలెంజ్..ఇలా చేస్తే సరి!

Cross Voting Challenge

Cross Voting 

Cross Voting : ఏపీలో జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు కూడా చేసుకున్నారు. ముమ్మరంగా ప్రచారం కూడా సాగిస్తున్నారు.  చంద్రబాబు, పవన్, బీజేపీ నేతలు మూకుమ్మడిగా కలిసి ప్రచారం చేస్తున్నారు. వైసీపీని అధికారానికి దూరం చేయడమే టీడీపీ కూటమి లక్ష్యం. ఆ దిశగానే ప్రయత్నాలు సాగిస్తోంది. నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. పొత్తులో భాగంగా అన్ని చోట్ల  నేతలు కలిసే ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఢిల్లీ నేతలు కలిసి సంయుక్తంగా తిరుగుతున్నారు. ఓట్లు రాబట్టుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీ ఎన్నికలు కావడంతో రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. దీంతో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందని నేతలు భయపడుతున్నారు. అందుకే వారికి వివరించి చెప్పడం లేదు. ఒకవేళ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాక కన్ఫ్యూజ్ అయితే మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నారు. ఉదాహరణకు ఎమ్మెల్యే స్థానంలో జనసేన అభ్యర్థి, ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఉంటే రెండు వేర్వేరు గుర్తులకు ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రజలకు నేర్పుగా చెప్పాల్సి ఉంటుంది. లేదంటే వృద్ధులు, నిరక్షరాస్యులు కన్ ఫ్యూజ్ అయిపోయి తమకు కనపడిన గుర్తుకు ఓటేస్తే కూటమికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. అయితే వైసీపీకి ఈ బాధ లేదు. ఎందుకంటే ఎంపీ, ఎమ్మెల్యే ఒకటే గుర్తు కావడంతో వారు ఒకటే సింబలే చెబుతారు. క్రాస్ ఓటింగ్ విషయంలో  కూటమి నేతలు జాగ్రత్త వహించాల్సి ఉంది.

ఈనేపథ్యంలో టీడీపీ కూటమి విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తోంది. జగన్ ను గద్దె దింపాలని చూస్తోంది. ప్రజలను చైతన్యం చేయాలని భావిస్తున్నాయి. కూటమి అభ్యర్థులు ఓడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇలా ఏపీలో టీడీపీ కూటమి క్రాస్ ఓటింగ్ కు చెక్ పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే జనాల్లో పార్టీల గుర్తులు, పొత్తులు, అభ్యర్థులపై పూర్తి స్పష్టత ఉంది. ఈ విషయంలో మరింత జాగ్రత్తగా కూటమి నేతలు, నాయకులు, కార్యకర్తలు ప్రజలను చైతన్యవంతం చేయాల్సి ఉంటుంది. ఇంటింటికీ తిరిగి ముఖ్యంగా వృద్ధులు, నిరక్షరాస్యులకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, గుర్తులను చెప్పాలి. అవసరమైతే ఇంటివద్ద నమూనా బ్యాలెట్ తీసుకెళ్లి వారితో ఒకటికి రెండు సార్లు ప్రాక్టిస్ చేయించాలి. అలాంటప్పుడు క్రాస్ ఓటింగ్ జరగకుండా ఉంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Exit mobile version