Education Funds : జాతీయ మీడియాలో ప్రచారమే పరమావధిగా జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా ఇండియా టుడే కోసం వైసీపీ ప్రభుత్వం అధికారికంగానే రూ. 4 కోట్ల, 20 లక్షలను మంజూరు చేసింది. అయితే ఈ సొమ్మును విద్యాశాఖ డబ్బుల నుంచి కేటాయించారు. దీనికి ఏపీ ఎడ్యుకేషన్ ప్రన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ ఇండియా టుడేకు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు కూడా ఇచ్చారు.
ఇండియా టుడే ఎడ్యుకేషన్ పై ఓ కాంక్లేవ్ నిర్వహిస్తోంది. ఇందులో నాలుగు ప్యానల్ డిస్కష్రన్లను బుక్ చేసుకునేందుకు రూ. 4 కోట్ల, 20 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఈ డిస్కష్రన్లతో ఏం ఒరుగుతుంది.. అంత అవసరం ఏంటంటే.. ఏమీ ఉండదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ రెడ్డికి అనుకూలంగా సర్వేలు నిర్వహించేందుకు ఈ మార్గంలో డబ్బులు ముట్టచెప్పుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీకి, అనుకూల సర్వేల కోసం జగన్ ప్రభుత్వం ప్రజల డబ్బులను వాడడం విషాదం అంటూ పలువురు చర్చించుకుంటున్నారు.
ఇప్పటికే టైమ్స్ నౌ.. ఎన్‌డీ టీవీలకు ఇమేజ్ బిల్డింగ్ పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు ముట్ట చెప్పారు. విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు సంబంధించి కీలకమైన కాంట్రాక్ట్ ను టైమ్స్ నౌ గ్రూపునకు కేటాయించారు. ప్రతీగా వారు తాడేపల్లి ప్యాలెస్ లో తయారయ్యే ఈటీజీ సర్వేలను నెలకోసారి ప్రసారం చేస్తుంటుంది. ఇక ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన ప్రతీ సర్వేలో జగన్ రెడ్డి ప్రభుత్వానికి ప్లస్ మార్క్స్ ఇస్తూనే ఉంటుంది. ఇవి వర్కవుట్ అవుతున్నాయా లేదా? అనే అనుమానంతో ఈ సారి ఇండియా టుడేతో ప్రయత్నించినట్లు ఏపీలో గుసగుసలు వినిపిస్తు్న్నాయి.